టాలీవుడ్ ఫిబ్రవరి రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు ఫిబ్రవరిలో ఏ సినిమాలకు ఇలాంటి పోటీ రాలేదు. సడెన్ గా వచ్చిన భీమ్లా నాయక్ తో యంగ్ హీరోలు పోటీకి సిద్దమంటారా..? లేదా వెనక్కి తగ్గుతారా..? అనేది తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 25 న మూడు సినిమాలు వరుణ్ తేజ్ గని, శర్వానంద్ ఆడవాళ్ళూ మీకు జోహార్లు, కిరణ్ అబ్బవరం సెబాస్టియన్.. ఇక 24 న అజిత్ వలిమై రిలీజ్ గేట్లను ప్రకటించి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాయి. ఇక సడెన్ పవన్ బరిలోకి దిగడంతో ఈ సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే సెబాస్టియన్, గని వెనక్కి తగ్గే పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వలిమై.. డబ్బింగ్ కాబట్టి అది ఖచ్చితంగా వస్తుంది.
ఇక శర్వా మాత్రం ఈసారి వెనక్కి తగ్గేదేలే అంటున్నాడు. ఏ సినిమా వచ్చిన ఫిబ్రవరి 25 న ఆడవాళ్లు మీకు జోహార్లు రిలీజ్ అవుతుందని చెప్పకనే చెప్తున్నాడు. నేడు డబ్బింగ్ ఫినిష్ చేసి ఫోటోలను షేర్ చేస్తూ ఫిబ్రవరి 25 న థియేటర్లో కలుద్దాం అంటూ చెప్పుకొచ్చాడు. భీమ్లా నాయక్ తో ఏ యంగ్ హీరో పోటీ పడగలడా..? ఎందుకు శర్వా రిస్క్ చేస్తున్నాడు. భీమ్లా నాయక్ కోసం ఎన్నో రోజుల నుంచి పవన్ ఫ్యాన్స్ తో పాటు చిత్ర పరిశ్రమ అంతా ఎదురుచూస్తోంది. అందులో టిక్కెట్ రేట్స్ తక్కువ ఉన్నా కూడా భీమ్లా వస్తున్నాడు అంటే దాని వెనుక కారణం తెలియంది కాదు. మరి ఈ విషయం తెలిసి కూడా శర్వా రిస్క్ చేస్తున్నాడా..? ఏమో లి ఇంకో వారం రోజులో రిలీజ్ డేట్ ని మార్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో.. వేచి చూడాల్సిందే.