కే.వి.రెడ్డిగా జనం మదిలో నిలచిన కదిరి వెంకటరెడ్డి తెలుగు సినిమాకు వెలుగులు అద్దిన వారిలో మేటి అనిపించుకున్నారు. దర్శకునిగా, నిర్మాతగా కేవీ రెడ్డి తనదైన బాణీ పలికించారు.
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం మరో వివాదంలో చిక్కుకున్నాడు. నిర్మాత నట్టి కుమార్ వర్మపై కేసు వేసిన సంగతి తెలిసిందే. తనకు రూ. 5 కోట్లు వర్మ చెల్లించాల్సి ఉందని, వాటిని ఇవ్వమని అడగగా వర్మ పట్టించుకోవడం లేదని, అందుకే తమ డబ్బులు చెల్లించేవరకు ఆర్జీవీ తీసిన సినిమా మా ఇష్టం విడుదల కాకుండా చూడాలని నట్టి కుమార్ కోర్టు లో కేసు వేశాడు. ఇక దీంతో కోర్టు మా ఇష్టం సినిమా విడుదల…
వైవిధ్యానికి మారు పేరు రామ్ గోపాల్ వర్మ అంటారు అభిమానులు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అన్నది అనేకుల మాట. రామ్ గోపాల్ వర్మ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన లేవనెత్తే వివాదాలే! ఒకటా రెండా ఏదో విధంగా వార్తల్లో నిలవడమే వర్మకు మహా ఇష్టం. ఎవరో ఒకరిని అడ్డంగా విమర్శించి వివాదానికి తెరలేపుతారాయన. తద్వారా తన తాజా చిత్రాలకు ఆ వివాదాలనే ప్రచారంగానూ మలచుకుంటారు. దటీజ్… వర్మ అనిపిస్తారు! తొలి చిత్రం ‘శివ’తోనే ఎంతోమందిని…
ప్రముఖ టాలీవుడ్ సీనియర్ దర్శకుడు శరత్ మృతిచెందిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఇక ఈ విషయం తెలియడంతో పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేశారు. దాదాపు 20 సినిమాలకు దర్శకత్వం వహించిన శరత్.. నందమూరి బాలకృష్ణతోనే ఎక్కువ సినిమాలు తీశారు. వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్ లాంటి భారీ విజయాలను బాలయ్య బాబు ఖాతాలో వేసిన దర్శకుడు శరత్. ఇక శరత్ మృతిపై బాలకృష్ణ సంతాపం వ్యక్తం…
హరీశ్ శంకర్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘గబ్బర్ సింగ్’. ఆ సినిమాతో సక్సెస్ ట్రాక్ పైకి ఎక్కిన హరీశ్ శంకర్ ఇప్పటికీ సరైన సబ్జెక్ట్ తగిలితే తకధిమితై ఆడిస్తానంటున్నారు. ‘గబ్బర్ సింగ్’తో పవన్ కళ్యాణ్ కు అబ్బో అనిపించే విజయాన్ని అందించిన హరీశ్ శంకర్ పవర్ స్టార్ తో మరో చిత్రం రూపొందిస్తున్నారు. ఆ సినిమా పేరు ‘భవదీయుడు భగత్ సింగ్’. టైటిల్ లోనే వైవిధ్యం కనిపిస్తోంది. కావున అందరిలోనూ ఆసక్తి కలుగుతోంది.…
అభిమానం గుండెల్లో నుంచి వస్తుంది.. ఒక్కసారి ఒకరిని అభిమానించమంటే వదలడం చాలా కష్టం. ముఖ్యంగా తెలుగువారు ఒకరిని అభిమానించారంటే .. చచ్చిపోయేవరకు వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. అయితే హీరోకు ఫ్యాన్స్ ఉండడం చూసి ఉంటాం.. హీరోయిన్స్‌కి ఫ్యాన్స్ ఉండడం చూసి ఉంటాం.. కానీ ఒక డైరెక్టర్ కి ఫ్యాన్స్ ఉండడం చాలా అరుదు.. అది ఇంతలా అభిమానించే ఒక అభిమాని ఉండడం నిజంగా అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన అభిమానిని సంపాదించుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన కలం నుంచి జాలువారిన పదాలు ఎన్నో మన జీవితాలకు పునాదులుగా మారాయి. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట భగవద్గీత విన్నట్లు ఉంటుంది. ఎక్కడైనా హీరోలకు హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ ఒక డైరెక్టర్ కి, ఆయన రాసే మాటలకు సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్. ఇక భీమ్లా నాయక్ సినిమాతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ పై ఒక ట్వీట్…
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఆయనకు మనసు లేదు.. రాతి గుండె .. ఫీలింగ్స్ ఉండవు.. ఆడవారిపై గౌరవం ఉండదు అని రకరకాలుగా వర్మ గురించి టాక్ నడుస్తూ ఉంటుంది. ఇక అమ్మాయిలతో వర్మ ఉండే తీరును బట్టి అమ్మాయిల పిచ్చోడు.. తాగుబోతు అని ఇంకొంతమంది అంటూ ఉంటారు. అయితే వీటిలో ఏది నిజం కాదని ఇటీవల వర్మ సోదరి చెప్పుకొచ్చింది. షో అప్ కోసం ఎవర్మ అమ్మాయిలతో తిరుగుతాడని,…
‘విక్రమ్’ అనగానే కమల్ హాసన్ నటించి, నిర్మిస్తున్న ‘విక్రమ్’ చిత్రమని అపోహ పడే ఆస్కారం లేకపోలేదు! కానీ ఇది మరో ‘విక్రమ్’ గురించిన సంగతి. గత యేడాది డిసెంబర్ 31న విడుదలైన ‘విక్రమ్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు హరిచందన్. నాగవర్మ, దివ్యారావు జంటగా నటించిన ఈ సినిమా తమిళంలోనూ ‘మహావీరన్’ పేరుతో విడుదలైంది. శుక్రవారం హరిచందన్ పుట్టినరోజు కావడంతో తన సినీ ప్రయాణం గురించి హరిచందన్ వివరించారు. ‘చిన్నతనం నుండి సినిమాలంటే ఉన్న ఆసక్తితో ఏడేళ్ళ…
సౌత్ హీరోయిన్ సమంతకు చిత్ర పరిశ్రమలో స్నేహితులు ఎక్కువే.. నిత్యం ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక వారి పుట్టినరోజు వస్తే స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలుపుతుంది. తాజాగా ఆమె నందిని రెడ్డికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. చిత్రపరిశ్రమలో డైరెక్టర్ నందిని రెడ్డి, సమంత మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింగర్ చిన్మయి, నందిని రెడ్డి, సామ్…