మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన కలం నుంచి జాలువారిన పదాలు ఎన్నో మన జీవితాలకు పునాదులుగా మారాయి. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట భగవద్గీత విన్నట్లు ఉంటుంది. ఎక్కడైనా హీరోలకు హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ ఒక డైరెక్టర్ కి, ఆయన రాసే మాటలకు సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్. ఇక భీమ్లా నాయక్ సినిమాతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ పై ఒక ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. “అల వైకుంఠపురంలో సినిమా తరువాత త్రివిక్రమ్ ఏ సినిమాకు దర్శకత్వం వహించలేదు.. కానీ రెండేళ్లలో డైలాగ్స్ రాసి 50 కోట్లు సంపాదించాడు” అంటూ ఒక వెబ్ సైట్ న్యూస్ రాసింది.
ఇక ఈ న్యూస్ కి ఒక నెటిజన్ రిప్లై ఇస్తూ ” సెట్స్ లో లుంగీ కట్టుకొని తిరుగుతూ రీమేక్ స్టోరీ కి 10 సార్లు నా కొడకా నా కొడకా అని డైలాగ్స్ యాడ్ చేసి ఎన్ని కోట్లు జేబులో వేసుకున్నాడు .. ఇది రా లైఫ్ అంటే” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ కి దర్శకుడు సాయి రాజేష్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ” 1500 రూపాయలతో రూమ్ షేర్ చేసుకొని, 50 కి పైగా సినిమాలకు ఘోస్ట్ రైటర్ గా పనిచేసి, మొదటి బ్రేక్ కోసం పదేళ్లు ఎదురుచూసిన అతనికి ఇది ఊరికే రాదు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. డైలాగ్స్ రాయడం అంత ఈజీ అనుకున్నావా..? అని కొందరు.. త్రివిక్రమ్ డైలాగ్స్ బావుంటాయి అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.