ప్రముఖ టాలీవుడ్ సీనియర్ దర్శకుడు శరత్ మృతిచెందిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఇక ఈ విషయం తెలియడంతో పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేశారు. దాదాపు 20 సినిమాలకు దర్శకత్వం వహించిన శరత్.. నందమూరి బాలకృష్ణతోనే ఎక్కువ సినిమాలు తీశారు. వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్ లాంటి భారీ విజయాలను బాలయ్య బాబు ఖాతాలో వేసిన దర్శకుడు శరత్. ఇక శరత్ మృతిపై బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు.
” ఆయన నాకు మంచి ఆప్తుడు.. పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనతో నేను వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, వంశోద్ధారకుడు సినిమాలు చేశాను. ఈరోజు ఆయన మరణవార్త నన్ను బాధించింది. మంచి మనిషి, నిస్వార్దపరుడు, ఆప్తుడిని కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ తెలిపారు.