Harish Shankar: భవదీయుడు.. హరీశ్ శంకర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హరీశ్ శంకర్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘గబ్బర్ సింగ్’. ఆ సినిమాతో సక్సెస్ ట్రాక్ పైకి ఎక్కిన హరీశ్ శంకర్ ఇప్పటికీ సరైన సబ్జెక్ట్ తగిలితే తకధిమితై ఆడిస్తానంటున్నారు. ‘గబ్బర్ సింగ్’తో పవన్ కళ్యాణ్ కు అబ్బో అనిపించే విజయాన్ని అందించిన హరీశ్ శంకర్ పవర్ స్టార్ తో మరో చిత్రం రూపొందిస్తున్నారు. ఆ సినిమా పేరు ‘భవదీయుడు భగత్ సింగ్’. టైటిల్ లోనే వైవిధ్యం కనిపిస్తోంది. కావున అందరిలోనూ ఆసక్తి కలుగుతోంది.
హరీశ్ శంకర్ 1979 మార్చి 31న జగిత్యాల సమీపంలోని ధర్మపురిలో జన్మించారు. చిన్నప్పటి నుంచీ చదువులో చురుకైన హరీశ్ కు సినిమాలంటే ఆసక్తి ఉండేది. ఎలాగైనా సరే వైవిధ్యంగా అలరించాలనీ తపించేవారు. చదువుకొనే రోజుల నుంచే నటనపై ఆసక్తి పెంచుకొని నాటకరంగంతో కొద్ది రోజులు సరదాగా సాగారు హరీశ్. నటించారు, నాటకాలు రచించారు, వాటికి దర్శకత్వం వహించారు. ఆ సరదాతోనే సినిమా రంగంవైపు పరుగు తీశారు. రచనలో చేయి చేసుకున్నారు, నటనలో కాలు పెట్టారు. చివరకు మెగాఫోన్ పట్టి అందరికీ ‘షాక్’ ఇచ్చారు. ఈ ప్రయాణంలో రచయిత కోన వెంకట్, దర్శకులు పూరి జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ వంటివారు హరీశ్ కు సహాయసహకారాలు అందించారు. రవితేజ హీరోగా రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ‘షాక్’తోనే హరీశ్ డైరెక్టర్ అయ్యారు.
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
తొలి సినిమా ‘షాక్’ నిజంగానే పలువురికి షాక్ ఇచ్చింది. కానీ, రవితేజకు హరీశ్ పై నమ్మకాన్ని పెంచింది. దాంతో రవితేజ మరో అవకాశం ఇచ్చారు. అదే ‘మిరపకాయ్’. ఇందులోని ఘాటు కొందరికి ఎక్కింది. హరీశ్ లో విషయం ఉందని అర్థమయింది. హిందీలో ఘనవిజయం సాధించిన సల్మాన్ ఖాన్ ‘దబంగ్’ ఆధారంగా తెలుగులో హరీశ్ శంకర్ సినిమా తీయాలని ఆశించారు. అదే సమయంలో ఆ చిత్రంపై కన్నుపెట్టిన పవన్ కళ్యాణ్, హరీశ్ నే పిలిపించి, అవకాశం అందించారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ ను నాయికగా ఎంచుకున్నారు హరీశ్ శంకర్. చిత్రమేంటంటే, అదే సమయంలో పవన్ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ కూడా తగిన విజయం కోసం ఆశగా ఉన్నారు. ఇక శ్రుతి హాసన్ విషయానికి వస్తే, అప్పటికే ఆమె పలు ఫ్లాపులు చూసి ‘ఐరన్ లెగ్’ ముద్ర వేయించుకుంది. పోనీ, హరీశ్ కు ఏమైనా సూపర్ డూపర్ హిట్ ఉందా అంటే అదీ లేదు. ఇన్ని మైనస్ లు కలసి రూపొందిన ‘గబ్బర్ సింగ్’ ప్లస్ టు ది పవరాఫ్ ప్లస్ గా మారి అనూహ్య విజయం సాధించింది. పవన్ కోరుకున్న గ్రాండ్ సక్సెస్ చిక్కింది. బండ్ల గణేశ్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా నిలిచారు. బంపర్ హిట్ ఆశించిన హరీశ్ శంకర్ కోరిక తీరింది. అన్నిటినీ మించి శ్రుతిహాసన్ కు ఐరన్ లెగ్ ముద్ర చెరిగిపోయింది. ఈ సక్సెస్ తరువాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో నటించాలని యంగ్ హీరోస్ పరుగులు తీశారు.
‘గబ్బర్ సింగ్’ తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్ తో ‘రామయ్యా వస్తావయ్యా’ తెరకెక్కించారు హరీశ్. ఆ సినిమా అంతగా అలరించలేకపోయింది. హరీశ్ పనైపోయిందనుకున్నారు. రెండేళ్ళ తరువాత సాయధరమ్ తేజ్ హీరోగా ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ తీసి మెప్పించారు. మెగా కాంపౌండ్ ను ఒప్పించారు. దాంతో అల్లు అర్జున్ హీరోగా ‘దువ్వాడ జగన్నాథమ్’ తీసే ఛాన్స్ దక్కించుకున్నారు హరీశ్. ఈ సినిమా విడుదలకు ముందే కొన్ని కాంట్రవర్సీస్ కు తెరలేపింది. విడుదలయ్యాక కుర్రకారును కిర్రెక్కించింది. మరి రెండేళ్ళ తరువాత మరో మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ తో ‘గద్దలకొండ గణేశ్’ తీసి ఆకట్టుకున్నారు హరీశ్. ఆ సినిమా తరువాత ఇప్పుడు మరో రెండేళ్ళ కు పవన్ కళ్యాణ్ తో సినిమా ఛాన్స్ పట్టేశారు హరీశ్. ఇలా రెండేళ్ళకో సారి మెగా ఫ్యామిలీ హీరోస్ సాగుతున్నారు హరీశ్ శంకర్. నిజానికి ‘గబ్బర్ సింగ్’ తరువాత అంతటి సాలిడ్ హిట్ పట్టలేకపోయారు హరీశ్. మరోసారి పవన్ తో కలసి పనిచేస్తున్నారు. మరి ఈ సారి ‘భవదీయుడు భగత్ సింగ్’తో ఏ తీరున హరీశ్ అలరిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!