Sukumar: నీ అభిమానానికి ఏం ఇచ్చి ఋణం తీర్చుకోగలను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభిమానం గుండెల్లో నుంచి వస్తుంది.. ఒక్కసారి ఒకరిని అభిమానించమంటే వదలడం చాలా కష్టం. ముఖ్యంగా తెలుగువారు ఒకరిని అభిమానించారంటే .. చచ్చిపోయేవరకు వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. అయితే హీరోకు ఫ్యాన్స్ ఉండడం చూసి ఉంటాం.. హీరోయిన్స్‌కి ఫ్యాన్స్ ఉండడం చూసి ఉంటాం.. కానీ ఒక డైరెక్టర్ కి ఫ్యాన్స్ ఉండడం చాలా అరుదు.. అది ఇంతలా అభిమానించే ఒక అభిమాని ఉండడం నిజంగా అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన అభిమానిని సంపాదించుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకున్న సుకుమార్ కి ఒక అభిమాని మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు.

వివరాల్లోకి వెళితే, సువీక్షిత్ బొజ్జా అనే అప్ కమింగ్ హీరో ఎన్నో ఏళ్లుగా దర్శకుడు సుకుమార్‌కి వీరాభిమాని. పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’తో భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరిగా నిలిచిన సుకుమార్ పై ఉన్న ప్రేమతో, అభిమానంతో.. ఇప్పటి వరకు ఏ అభిమాని కూడా చేయని ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడు. దానిని విజయవంతంగా పూర్తి చేశాడు. ‘దూరదర్శిని’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సువీక్షిత్.. తన సొంత గ్రామమైన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలోని బోరెడ్డిగారి పల్లి గ్రామంలో.. ఆయన సొంత వ్యవసాయం భూమిలో రెండున్నర ఎకరాల భూమిలో దర్శకుడు సుకుమార్ రూపాన్ని వచ్చేటట్లు వరి పంటతో సాగు చేశారు.
Also Read
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?

దాదాపు 50 రోజుల వ్యయప్రయాసలతో.. ఆ పంటను సుకుమార్ రూపానికి తీసుకువచ్చాడు. ఇలా అభిమానాన్ని చాటుకున్న సువీక్షిత్ అందరి దృష్టిని ఆకర్షించి హాట్ టాపిక్‌గా మారాడు. ఈ సాగుచేసిన పంట భూమిని ఆ రూపానికి తీసుకువచ్చిన తర్వాత.. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడంతో పాటు.. సుకుమార్ పేరు మీద ఓ ప్రత్యేక పాటను రెడీ చేశాడు. సుకుమార్ రూపంతో పాటు.. ‘పుష్ప 2’ అని కూడా వరిసాగు చేయడం.. అల్లు అర్జున్ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సాంగ్‌ను, వీడియోను చూసిన సుకుమార్ ‘‘నా నోట మాట రావడం లేదు.. నా కళ్లు చెమర్చాయి. ఓ మనిషి మీద ఇంత అభిమానం ఉంటుందా?.. నీ అభిమానానికి ఏం ఇచ్చి ఋణం తీర్చుకోగలను’’ అంటూ అందరి సమక్షంలో సువీక్షిత్‌ని అభినందించారు.
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!