సాధారణంగా పండగకు ప్రతి ఒక్కరు అందరు బాగుండాలని కోరుకుంటారు. తమ జీవితంలో మంచి రోజులు రావాలని, ఐశ్వర్యారోగ్యాలు ఉండాలని, తమతో పాటు అందరు కూడా బావుండాలని కోరుకుంటారు. మంచి తెలుస్తూనే శుభాకాంక్షలు తెలుపుతారు. అయితే అందరిలా చెప్తే తనకు వాల్యూ ఏముంటది అనుకున్నాడో.. లేక నా తీరే ఇంత అని మరోసారి నిరూపిద్దామనుకున్నాడో.. వివాదాల దర్శకుడు వెరైటీగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాడు. ” అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భగవంతుడు మీలో ప్రతి ఒక్కరికి పెద్ద ఇల్లు…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ నేడు తన 52 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇక నేడు సుకుమార్ బర్త్ డే విషెస్ తో ట్విట్టర్ మారుమ్రోగిపోయింది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సుకుమార్ కి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇప్పటికే ఆయనాతో కలిసి పనిచేసిన రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్ వంటి హీరోలు లెక్కల మాస్టర్ కి తమదైన రీతిలో శుభాకాంక్షలు తెలుపగా.. ఇకముందు పనిచేసే హీరో విజయ్ దేవరకొండ అంతే స్పెషల్…
దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప’ గుబాళింపులతో ఆనందతీరాల్లో విహరిస్తున్నారు. జనం కోరేది మనం ఇవ్వాలి… మనం చేసేది జనం మెచ్చేలా ఉండాలి… ఈ సూత్రాన్ని తు.చ. తప్పక పాటిస్తారు సుకుమార్. ఆ సూత్రంతో పాటు, జనానికి ఎప్పుడు ఏ కథ చూపించాలి, ఏ సన్నివేశాన్ని ఎలా పండిస్తే రక్తి కడుతుంది అన్న సూత్రాలనూ అధ్యయనం చేసి సరైన లెక్కలు వేసుకొని, మరీ పక్కాగా సినిమాలు తెరకెక్కిస్తారాయన. అదే సుకుమార్ బాణీగా మారింది. దానికి జై కొట్టే జనం…
శతాధిక కథాచిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనులు తెలుగునాటనే అధికంగా ఉండడం విశేషం. వారిలో యాక్షన్ మూవీస్ తో అధికంగా మురిపించిన కె.ఎస్.ఆర్.దాస్ స్థానం ప్రత్యేకమైనది. చిత్రసీమలోని 24 శాఖలలో పట్టున్న దర్శకులు అరుదుగా కనిపిస్తారు. కె.ఎస్.ఆర్. దాస్ అన్ని శాఖల్లోనూ పట్టు సాధించాకే ‘లోగుట్టు పెరుమాళ్ళ కెరుక’తో దర్శకుడయ్యారు. ఆపై ‘రాజయోగం’ చూడాలనుకున్నాడు ‘రాజసింహ’ తీశాడు. ‘గండరగండడు’ కాసింత కరుణించాడు. తరువాత ‘గందరగోళం’లో పడ్డాడు దాసు. ఆ సమయంలో కృష్ణ ద్విపాత్రాభినయంతో తెరకెక్కించిన ‘టక్కరి దొంగ –…
దన్నుగా ధనమెంతో ఉన్నా మన్నువాసన తెలిసినవాడు కాబట్టి మట్టి మనుషుల పక్షాన నిలచి వారి కోసం గళమెత్తినవాడు దర్శకనిర్మాత,రచయిత,నటుడు బి.నరసింగరావు. బూజుపట్టిన నిజామురాజు పాలనలోనే భూస్వాములుగా ఉన్న నరసింగరావు పెద్దలు, మొదటి నుంచీ అణగారిన జనం బాగు కోసం పాటు పడ్డారు. తన చిత్రాలతో జనాన్ని మెప్పించడంలోనే కాదు, ప్రభుత్వ అవార్డులూ, రివార్డులూ పట్టేసి అలరించారు నరసింగరావు. మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ లో 1946 డిసెంబర్ 26న నరసింగరావు జన్మించారు. ధనానికి కొదువలేని ఇంట్లో జన్మించడం వల్ల…
నవతరం దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొని సక్సెస్ రూటులో సాగిపోతున్నారు సురేందర్ రెడ్డి. తొలి చిత్రం ‘అతనొక్కడే’ మొదలు మొన్నటి ‘సైరా…నరసింహారెడ్డి’ దాకా తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యం చూపించే ప్రయత్నం చేశారు సురేందర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా మాచంపల్లి సురేందర్ రెడ్డి స్వగ్రామం. 1975 డిసెంబర్ 7న సురేందర్ రెడ్డి జన్మించారు. ఆయన తండ్రి వీరారెడ్డి వారి గ్రామానికి సర్పంచ్ గా ఉండేవారు. సురేందర్ రెడ్డికి చిన్నప్పటి నుంచీ సినిమాలంటే…