Krishna Vamsi: క్రియేటి డైరెక్టర్ కృష్ణవంశీ పేరు గత కొన్నిరోజులుగా మారుమ్రోగిపోతుంది. కొన్నేళ్లుగా సినిమాలకు గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ రంగమార్తాండ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఇది సెట్స్ మీద ఉండగానే అన్నం అనే సినిమాను అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేశాడు. అది పక్కన పెడితే.. ఈ సినిమాలో ప్రభాస్ హీరో అని చెప్పడంతో ఒక్కసారిగా కృష్ణవంశీ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోయింది. ఇక కొన్నిరోజుల నుంచి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న కృష్ణవంశీ ఎట్టకేలకు తన వ్యక్తిగత రూమర్స్ పై స్పందించాడు. ఎన్నో ఏళ్ళుగా కృష్ణవంశీ, రమ్యకృష్ణ విడాకులు తీసుకుంటున్నారని, వారి మధ్య విబేధాలు తలెత్తి విడిగా ఉంటున్నారని వార్తలు గుప్పుమంటూనే వస్తున్నాయి.
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ” నేను ఈ వార్తలను వింటూనే వస్తున్నాను. నాకు మొదటి నుంచి బంధాలు, బాధ్యతలు అంటే ఇష్టం ఉండదు. నేనెప్పుడు ఒంటరిగా ఉండాలనుకుంటాను. కానీ, ఇవన్నీ పక్కన పెట్టి రమ్యకృష్ణను పెళ్లాడాను. ఆమె ఇష్టాలకు, అభిరుచులకు నేను గౌరవం ఇస్తాను. ఆమె కూడా నా అభిప్రాయానికి విలువనిస్తుంది. మా మధ్య విబేధాలు అని వార్తలు వచ్చినప్పుడు ఇద్దరం కలిసి నవ్వుకుంటాం. వాటిని లైట్ తీసుకోవడం మొదలుపెట్టాం. వాటిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశాం. మేము ఏంటి.. ఆమె మధ్య బంధం ఏంటి అనేది మా ఇద్దరికి మాత్రమే తెలుసు. ఇంట్లోకి వెళ్లాక మా ఇద్దరి ప్రపంచం వేరు” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ జంట విడాకులు తీసుకుంటున్నారు అనేది పూర్తిగా అవాస్తవమని తెలిసిపోయింది.