వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఆయనకు మనసు లేదు.. రాతి గుండె .. ఫీలింగ్స్ ఉండవు.. ఆడవారిపై గౌరవం ఉండదు అని రకరకాలుగా వర్మ గురించి టాక్ నడుస్తూ ఉంటుంది. ఇక అమ్మాయిలతో వర్మ ఉండే తీరును బట్టి అమ్మాయిల పిచ్చోడు.. తాగుబోతు అని ఇంకొంతమంది అంటూ ఉంటారు. అయితే వీటిలో ఏది నిజం కాదని ఇటీవల వర్మ సోదరి చెప్పుకొచ్చింది. షో అప్ కోసం ఎవర్మ అమ్మాయిలతో తిరుగుతాడని, అమ్మాయిల విషయంలో ఏ రోజూ వర్మ నోరుజారింది లేదని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో వర్మలో మరో యాంగిల్ ఉంది అని తెలిసొచ్చింది.
ఇక తాజాగా వర్మ తనలోని మరో యాంగిల్ ని బయటపెట్టాడు. అందరి లాగే తనకు కూడా ఫీలింగ్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. తన ఇన్స్టాగ్రామ్ లో కుక్కతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ .. నాలో కూడా ఫీలింగ్స్ ఉన్నాయి అని తెలిపాడు. అందరికి జంతువులు అంటే ఎంతో ఇష్టమో వర్మకు కూడా జంతువులు అంటే ఇష్టమంట.. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోపై నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఓహో వర్మలో కొత్త కోణం బయటపడింది అని కొందరు.. తాగేసి ఉన్నావా.. సన్నీలియోన్ అనుకోని కుక్కను కానీ పట్టుకున్నావా అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.