తిరుపతి రాయల చెరువు ప్రమాదకరంగా ఉంది. ఏ క్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ విషయం పై ఎన్టీవీతో స్పెషల్ ఆఫీసర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ… రాయల్ చెరువు పరిస్థితి క్రిటికల్ గా ఉంది. రాత్రి దేవుడు దయతో భయటపడాలీ అని కోరుకుంటున్నాం. మా ప్రయత్నాలు మేము వంద శాతం గండి పూడ్చానికి చేస్తాం. 0.9 టి.ఎం.సి నీళ్ళు రాయల్ చెరువులో ప్రస్తుతం వున్నాయి. గతంలో ఇంత కెపాసిటీ నీళ్ళు గతంలో ఏ చెరువుకు రాలేదు. కాబట్టి…
భారీవర్షాలు, వరదలతో తిరుపతిలోని రాయల చెరువు డేంజరస్‌గా మారింది. చెరువు కట్టకు స్వల్ప గండి పడటంతో వరదనీరు లీకవుతోంది. చెరువు కట్ట నుంచి జారుతున్న మట్టితో భయాందోళన చెందుతున్నారు స్థానికులు. ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు సమీప ప్రజలు. రాయల చెరువు తెగితే వంద పల్లెలకు ముంపు ప్రమాదం వుందని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. చెరువు దిగువ పల్లెలను అప్రమత్తం చేసిన అధికారులు రాయల చెరువు మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. సంతబైలు, ప్రసన్న వెంకేటేశ్వరపురం,…
తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దాంతో టీటీడీ దర్శనాలు నిలిపివేసింది. అయితే ఈ వర్షాలతో టీటీడీ కి 4 కోట్లకు పైగా నష్టం వచ్చింది అని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. మొదటి ఘాట్ రోడ్డులో ఐదు ప్రాంతాలలో కోండ చరియలు విరిగిపడ్డాయి. రెండవ ఘాట్ రోడ్డులో 13 ప్రాంతంలో కొండచరియలు విరిగిపడగా…ఐదు ప్రాంతాలలో రక్షణ గోడ దెబ్బతింది అని అన్నారు. అలాగే నారాయణగిరి అతిథి గృహం వద్ద కోండచరియలు విరిగిపడడంతో మూడు గదులు…
ఒకవైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న రాష్ట్రంపై భారీవర్షాలు తీరని భారం మోపాయి. భారీ వర్షాలు.. వరదలతో నాలుగు జిల్లాల్లో తీరని నష్టం సంభవించింది. నెల్లూరు, చిత్తూరు, అనంత, కడప జిల్లాలకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు 24 మంది వర్షాలు, వరదల వల్ల చనిపోయినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. కడపలో 13, అనంతలో 7, చిత్తూరులో 4 మంది జల విలయానికి బలయ్యారు. 17 మంది గల్లంతైనట్టు ప్రకటించింది ప్రభుత్వం. కడపలో 11, చిత్తూరులో…
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో.. వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అండగా నిలవాలి. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలి. పసి పిల్లలకు పాలు, బిస్కెట్స్ అందించి ఆకలి తీర్చండి అని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్, టీడీపీ ,ఐ-టీడీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా ప్రాంతాలకు ఆహారం, మందులు పంపిణీ జరుగుతోంది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో టీడీపీ శ్రేణులు సహాయక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను…
ఏపీలో ముఖ్యంగా తిరుపతిలో గ్రామాలను వరదలు ముంచెత్తుతున్నాయి. అయితే తాజాగా రాయల్ చెరువు నిండిపోవడంతో 7 గ్రామాలు ముంపుకు గురైయ్యాయి. చెరువుకు వున్న మొరవ ఆక్రమణకు గురైవడంతో గ్రామాలు ముంపుకు గురైవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు గ్రామస్థులు. ఈ వరదలతో 7 గ్రామ ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంభంధాలు తెగిపోయాయి. ఆహారం కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు గ్రామస్థులు. తమ గ్రామాలు వైపు అధికారులు కన్నేత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూన్నారు గ్రామస్థులు. అయితే ఏపీలో…
భారీ వర్షాల కారణంగా తిరుపతిలోని ఊర్లన్నీ చెరువుల్లా మారాయి. తిరుపతిలో గ్రామాల మధ్య వివాదంగా మారింది రాయలచెరువు. గండి కొట్టాలని ఒకవైపు గ్రామస్థులు….గండి కొట్టకూడదని మరో వైపు గ్రామస్థులు అంటున్నారు. చెరువుకు అవుట్ ప్లో కంటే ఇన్ ప్లో ఎక్కువగా వుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. రాయల్ చెరువు నిండిపోవడంతో 7 గ్రామాలు ముంపునకు గురయ్యాయి, తమను అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువుకు వున్న మొరవ ఆక్రమణకు గురి కావడంతో…
రాయలసీమలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణ వర్షం కురిస్తే ఫర్వాలేదు. కానీ, ఎప్పడూ చూడని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక తిరుపతిలో ఎటు చూసినా వర్షం, వరద తప్పించి మామూలు నేల కనిపించడం లేదు. భారీ వర్షాలు కురుస్తుండటంతో పిల్లలు, పెద్దలు ఇంటికే పరిమితం అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో పిల్లలు కొందరు వరద నీటిని స్విమ్మింగ్‌పూల్ గా భావించి ఈత కొడుతున్నారు. Read: భారీగా…
తిరుపతిలో నిన్న కొద్దిగా శాంతించిన వరణుడు ఈరోజు తిరిగి ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి తిరుమల, తిరుపతిలో భారీగా వర్షం కురుస్తోంది. ఈ వర్షాల ధాటికి మళ్లి చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే తిరుపతి నగరంలో ఎటు చూసినా నీరు తప్పించి మరేమి కనిపించడంలేదు. Read: ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత… అటు తిరుమలకు వెళ్లే మెట్ల మార్గం, రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. శ్రీవారి మెట్టు మార్గం…
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులను ఆరా తీశారు ప్రధాని నరేంద్ర మోడీ. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల పరిస్థితిని ప్రధానికి వివరించారు జగన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం వైయస్ జగన్ ఏరియల్ సర్వే చేయనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు జగన్. బంగాళా ఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా గత వారం రోజులుగా…