ఉదయాస్తమాన సేవా టిక్కెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది. సాధారణ రోజులో ఉదయాస్తమాన సేవా టిక్కెట్టు కోటి రూపాయలుగా… శుక్రవారం రోజున కోటిన్నరాగా నిర్ణయించింది. ప్రస్తుతం టీటీడీ వద్ద అందుబాటులో 531 ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు ఉన్నాయి. ఉదయాస్తమాన సేవా టిక్కెట్ల పై 25 సంవత్సరాల పాటు స్వామి వారి ఆర్జిత సేవలో పాల్గోనే అవకాశం పోందనున్నారు భక్తులు. ఏడాదికి ఒక్కరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు భక్తులు పాల్గొనే సౌలభ్యం ఉంది.…
న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు. పాదయాత్రలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. తిరుపతిలో ఈరోజు అమరావతి రైతు మహాసభ జరిగింది. ఈ సభకు ప్రతిపక్షాలు హాజరయ్యాయి. కాగా, అమరావతి సభపై వైపీసీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. క్యాపిటల్ కోసం జరిగిన కాదని, క్యాపిటలిస్టు కోసం జరిగిన పాదయాత్ర అని అమర్నాథ్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర రాయలసీమపై దండయాత్ర చేసినట్లు పాదయాత్ర చేశారని, విశాఖ…
గత టీడీపీ హయాంలో రూ. 8 కోట్ల 20 లక్షలతో ముడసర్లోవ వద్ద ట్రాన్సీట్ హాల్ట్ ఏర్పాటు చేశాం. ఆధునిక యంత్రాలతో చెత్త నుంచి కంపోస్టు తయారీ, మిగిలిన చెత్తను కాపులప్పాడ యార్డుకు తరలించాలని దీనిని ఏర్పాటు చేసారు అని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అన్నారు. కానీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తగిన నిధులు ఇవ్వకుండా దీన్ని డంపింగ్ యార్డుగా తయారు చేసింది. ఆ డంపింగ్ యార్డు వల్ల పక్కనే ఉన్న ముడసర్లోవ రిజర్వాయర్ జలాలు,…
వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తాం అని వైవి సుబ్బారెడ్డి అన్నారు. జనవరి 13 న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతుంది. కోవిడ్ నిభందనలు సడలిస్తే…పండుగ తరువాత సర్వదర్శనం పెంపు ,ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడం ప్రారంభిస్తాం. 11 మంది చిన్నపిల్లలుకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స నిర్వహించారు. చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భక్తులుకు ఉదయాస్తమాన సేవకు అనుమతించేలా అవకాశం…
సీఎం ప్రకటించినా.. ఉద్యోగ సంఘాలు మాత్రం ఏమాత్రం తగ్గేది లేదంటున్నాయి. మరో పది రోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు తమ కార్యాచరణకు దిగుతున్నారు. తిరుపతిలో పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ చేసిన కామెంట్లపై స్పందించిన ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, ఫ్యాప్టో అధ్యక్షుడు శ్రీధర్… మా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు… మరోవైపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశం…
ఓ వైపు ఇప్పటికే పీఆర్సీ ప్రిక్రియ పూర్తి అయ్యింది.. మరో పది రోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతుంటే.. తమ ఆందోళన మాత్రం ఆపేదిలేదని స్పష్టం చేస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.. తిరుపతిలో పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ చేసిన కామెంట్లపై స్పందించిన ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, ఫ్యాప్టో అధ్యక్షుడు శ్రీధర్… మా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు… మాకు పీఆర్సీ పై ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక…
ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళనబాట పట్టాయి… ఇందులో భాగంగా భవిష్యత్ కార్యాచరణపై సీఎస్ సమీర్ శర్మకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. వారంలోగా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమంలోకి వెళ్తామని హెచ్చరించాయి.. అయితే, ఇవాళ పీఆర్సీపై కీలక ప్రకటన చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్ను తిరుపతిలోని సరస్వతీ నగర్లో ఉద్యోగుల తరపున కొందరు ప్రతినిధులు కలిశారు.. ఈ సందర్భంగా.. పీఆర్సీపై సీఎంకు విజ్ఞప్తి చేశారు.. దీనిపై స్పందించిన…
తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో వైద్యులు అత్యంత క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తి తాపీ పనిచేస్తూ ఓ భవనం నుంచి కిందపడ్డాడు. దీంతో తొడ భాగంలో 3 అడుగుల 10ఎంఎం సైజు గల ఇనుపకడ్డీ చొచ్చుకెళ్లింది. బాధితుడిని తొలుత కైకలూరు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు శస్త్రచికిత్స చేయలేమని చెప్పడంతో అనంతరం విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు కూడా తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు చివరకు బాధితుడు…
టీటీడీ అధికారులుతో వరుస సమావేశాలు నిర్వహించారు ఈవో జవహర్ రెడ్డి. అయితే విపత్తు సమయంలో భక్తులకు ముందస్తు సూచనలు చేసేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చెయ్యాలి అని జవహర్ రెడ్డి తెలిపారు. అయితే ఈ మధ్యే తిరుపతిలో వచ్చిన వరదల గురించి అందరికి తెలిసిందే. ఆ వరదల వల్ల భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇక ఈ వరదల్లో పాడైన ఘాట్ రోడ్లు ,శ్రీవారి మెట్టు నడకమార్గంలో మరమత్తు పనులు వేగవంతంగా నిర్వహించాలి…
ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు రాయలచెరువు లీకేజీలతో తిరుపతి జనం కంటిమీద కునుకులేకుండా పోతోంది. తాజాగా ఓ పాత భవనం కుప్పకూలింది. తిరుపతి భవానీ నగర్ లో కుప్పకూలింది మూడంతస్థుల భవనం. వర్షాలకు పది రోజులుగా పాత భవనం నానిపోయింది. శిథిలావస్ధకు చేరడంతో రెండేళ్ళ క్రితమే ఇంటిని ఖాళీచేశాడు యాజమాని. ఇంటిలో, సమీప ప్రాంతాలలో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. ఇదిలా వుంటే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి వర్షాలు. రాత్రి తిరుపతి, శ్రీకాళహస్తి,సత్యవేడు,…