చెంబుకి అతీతశక్తులు.. రైస్ ఫుల్లింగ్ ముఠా గుట్టురట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈజీమనీ కోసం దారుణమయిన మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్ళు. నమ్మితే చాలు నట్టేటముంచుతున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో చెంబుకి అతీతశక్తులు ఉన్నాయని మోసం చేస్తున్న రైస్ పుల్లింగ్ ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. వారి గుట్టును రట్టుచేశారు. చెంబుకి కెమికల్స్ అద్ది బియ్యాన్ని ఆకర్షించేలా చేసింది రైస్ పుల్లింగ్ ముఠా. దీనిని నమ్మేశారు అమాయక జనం.

యూట్యూబ్ లో చూసి మోసాన్ని ఎలా చేయాలో నేర్చుకుంది ముఠా. గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి ముఠాను కాంటాక్ట్ చేశారు. అంతే వీరి బుట్టలో పడ్డాడా వ్యక్తి. ఒకటిన్నర లక్షకు చెంబును అమ్మేసింది ముఠా. అయితే తాను మోసపోయానని తర్వాత తెలుసుకున్నాడా వ్యక్తి. చెంబుకి ఎటువంటి శక్తులు లేకపోవడంతో తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు హేమంత్ కుమార్ తో పాటు విజయ్ కుమార్,నాగరాజులను అరెస్టు చేసి ఒకటిన్నర లక్ష నగదు,చెంబుని స్వాధీనం చేసుకున్నారు. రెండు తలల పాములు, చెంబుల పేరుతో కేటుగాళ్ళు చేస్తున్న మోసాలపై అవగాహన కలిగి వుండాలని, ఈరోజుల్లో ఇలాంటివి నమ్మకూడదని సలహా ఇస్తున్నారు పోలీసులు.
Also Read
తాజావార్తలు
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
-
Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
-
OTR: పశ్చిమ గోదావరి వైసపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..