తిరుపతి ముంపునకు కారణం ఎవరు…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి ముంపునకు కారణం ఎవరు? వర్షం తగ్గి వారం అవుతున్నా నగరంలో నీరు ఎందుకు లాగడం లేదు? ఇప్పటికీ పలు కాలనీలు నీటిలోనే ఎందుకు నానుతున్నాయి? ఇది ప్రకృతి వైపరిత్యామా లేక ఆ నేత వాస్తు భయమా?
తిరుపతి ప్రజలు గతంలో ఎన్నాడూ చూడని వరద ఇక్కట్లు..!
Also Read
- Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
- Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు... ఆ సీట్లు దక్కేదెవరికి..?
- Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా... ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి...?
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ప్రపంచ పటంలో తిరుపతికి ఒక ప్రత్యేకత స్థానం ఉంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభూవై వెలసిన పుణ్యక్షేత్రం. నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు తిరుపతి వస్తుంటారు. తిరుపతికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీలు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కేంద్ర సర్కార్ సైతం స్మార్ట్ సిటీ కింద తిరుపతి అభివృద్ధికి నిధులు కేటాయించింది. ఇలా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న తరుణంలో ప్రకృతి పగబట్టిందా అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయి. భారీ వర్షాలకు తిరుపతి ప్రజానీకం ఎన్నడు చూడని ఇక్కట్లను ఎదుర్కొంటోంది. శేషాచల కొండల నుంచి పోటెత్తిన నీటి ప్రవాహం తిరుపతిని ముంచెత్తుతూ ఉంటే.. చెరువులను ఆక్రమించడంతో అక్కడి నీరు కూడా నగరంలోకి పరుగులు తీస్తోంది. వాన నీరు నిలిచిపోయి వారమైనా.. వరద తగ్గలేదు.
వాస్తు విరుద్ధమని చెప్పడంతో సప్లయ్ ఛానల్ మూయించిన ఓ నేత..!
తిరుపతి ఇలా కనీవినీ ఎరుగని రీతిలో వరదతో అతలాకుతలం కావడానికి ప్రధాన కారణం పట్టణానికి ఎగువ ప్రాంతంలో ఉన్న చెరువుల్లో నీరును తిరుపతివైపు మళ్లించడమే. పేరూరు చెరువు నుంచి నీటి ప్రవాహం తిరుపతి వైపు దూసుకొస్తోంది. ఫలితంగా నగరంలోని పలు కాలనీలు నీట మునగడమేకాక.. వారం తర్వాత కూడా నీళ్లలోనే నానుతూ ఉన్నాయి. వాస్తవానికి పేరూరు చెరువు నుంచి తుమ్మలగుంట చెరువుకు.. తుమ్మలగుంట నుంచి అవిలాల చెరువుకు గతంలో సప్లయ్ ఛానల్స్ ఉండేవి. తుమ్మలగుంట గ్రామానికి ఆగ్నేయ ప్రాంతంతో తుమ్మలగుంట చెరువు ఉంది. అది వాస్తు విరుద్ధం అని ఎవరో చెప్పడం దాన్ని నమ్మిన ఆ ప్రాంత ప్రజాప్రతినిధి ఆ సప్లయ్ ఛానల్‌ను మూసివేయించారట. తుమ్మలగుంట చెరువుకు పేరూరు చెరువు నుంచి నీరు రాకుండా తిరుపతి వైపు మళ్లించేశారట.
పాత కాల్వ మీదుగా నీటి మళ్లింపును అంగీకరించని స్థానికులు..!
తిరుపతిలో ఇంకా 8 వార్డులు నీటిలోనే ఉన్నాయి. దాదాపు 40 వేల మంది ఇబ్బంది పడుతుండటంతో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అధికారులపై మండిపడ్డారు. పేరూరు చెరువు నీళ్లు తిరుపతివైపు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినా ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పేరూరు చెరువు నుంచి నీటి మళ్లింపు చేపట్టాలంటే అధికారులకు ప్రస్తుతం రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి నీటిని పాతకాల్వ గ్రామం మీదుగా స్వర్ణముఖి నదిలోకి మళ్లించడం లేదా తుమ్మలగుంటకు సప్లయ్ ఛానల్స్‌ను పునరుద్ధరించడం. అయితే పాతకాల్వ గ్రామం మీదుగా నీటి మళ్లింపు ఆ ప్రాంత ప్రజలు అంగీకరించలేదు. తమ గ్రామాన్ని ముంచేస్తున్నారని హైవేపై అక్కడి ప్రజలు ఆందోళనకు దిగడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు అధికారులు.
ఆ నేత తీరువల్లే తిరుపతి మునిగిపోతోందా?
తుమ్మలగుంట చెరువు మీదుగా నీటి మళ్లింపు చేపట్టాలంటే వాస్తు భయం పట్టుకున్న ఆ ప్రాంత ప్రజాప్రతినిధి అంగీకరించడం లేదట. దీంతో ఆ ఆలోచన గాలికొదిలేశారు. అందుకే ఎగువ ప్రాంతంలోని చెరువు నీరంతా ఇంకా తిరుపతిని ముంచెత్తుతోంది. ఆ గ్రామ వాస్తు.. ఆ నేత వాస్తు భయాలు ఇప్పుడు తిరుపతి ప్రజల పాలిట శాపంలా మారాయట. మళ్లీ వారంపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇకనైనా తుమ్మలగుంట, అవిలాల చెరువులకు ఉన్న సప్లయ్ చానల్స్ పునరుద్ధరించకపోతే తిరుపతికి వరద ప్రవాహం మరింత పెరుగుతుంది. మరి.. అధికారులు ఆ గ్రామ వాస్తుకు ప్రాధాన్యం ఇస్తారో లేక ప్రజల ప్రాణాలను పట్టించుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?