ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళనబాట పట్టాయి… ఇందులో భాగంగా భవిష్యత్ కార్యాచరణపై సీఎస్ సమీర్ శర్మకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. వారంలోగా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమంలోకి వెళ్తామని హెచ్చరించాయి.. అయితే, ఇవాళ పీఆర్సీపై కీలక ప్రకటన చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్ను తిరుపతిలోని సరస్వతీ నగర్లో ఉద్యోగుల తరపున కొందరు ప్రతినిధులు కలిశారు.. ఈ సందర్భంగా.. పీఆర్సీపై సీఎంకు విజ్ఞప్తి చేశారు.. దీనిపై స్పందించిన…
తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో వైద్యులు అత్యంత క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తి తాపీ పనిచేస్తూ ఓ భవనం నుంచి కిందపడ్డాడు. దీంతో తొడ భాగంలో 3 అడుగుల 10ఎంఎం సైజు గల ఇనుపకడ్డీ చొచ్చుకెళ్లింది. బాధితుడిని తొలుత కైకలూరు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు శస్త్రచికిత్స చేయలేమని చెప్పడంతో అనంతరం విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు కూడా తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు చివరకు బాధితుడు…
టీటీడీ అధికారులుతో వరుస సమావేశాలు నిర్వహించారు ఈవో జవహర్ రెడ్డి. అయితే విపత్తు సమయంలో భక్తులకు ముందస్తు సూచనలు చేసేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చెయ్యాలి అని జవహర్ రెడ్డి తెలిపారు. అయితే ఈ మధ్యే తిరుపతిలో వచ్చిన వరదల గురించి అందరికి తెలిసిందే. ఆ వరదల వల్ల భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇక ఈ వరదల్లో పాడైన ఘాట్ రోడ్లు ,శ్రీవారి మెట్టు నడకమార్గంలో మరమత్తు పనులు వేగవంతంగా నిర్వహించాలి…
ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు రాయలచెరువు లీకేజీలతో తిరుపతి జనం కంటిమీద కునుకులేకుండా పోతోంది. తాజాగా ఓ పాత భవనం కుప్పకూలింది. తిరుపతి భవానీ నగర్ లో కుప్పకూలింది మూడంతస్థుల భవనం. వర్షాలకు పది రోజులుగా పాత భవనం నానిపోయింది. శిథిలావస్ధకు చేరడంతో రెండేళ్ళ క్రితమే ఇంటిని ఖాళీచేశాడు యాజమాని. ఇంటిలో, సమీప ప్రాంతాలలో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. ఇదిలా వుంటే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి వర్షాలు. రాత్రి తిరుపతి, శ్రీకాళహస్తి,సత్యవేడు,…
ఈజీమనీ కోసం దారుణమయిన మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్ళు. నమ్మితే చాలు నట్టేటముంచుతున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో చెంబుకి అతీతశక్తులు ఉన్నాయని మోసం చేస్తున్న రైస్ పుల్లింగ్ ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. వారి గుట్టును రట్టుచేశారు. చెంబుకి కెమికల్స్ అద్ది బియ్యాన్ని ఆకర్షించేలా చేసింది రైస్ పుల్లింగ్ ముఠా. దీనిని నమ్మేశారు అమాయక జనం. యూట్యూబ్ లో చూసి మోసాన్ని ఎలా చేయాలో నేర్చుకుంది ముఠా. గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి ముఠాను కాంటాక్ట్ చేశారు. అంతే…
తిరుపతి ముంపునకు కారణం ఎవరు? వర్షం తగ్గి వారం అవుతున్నా నగరంలో నీరు ఎందుకు లాగడం లేదు? ఇప్పటికీ పలు కాలనీలు నీటిలోనే ఎందుకు నానుతున్నాయి? ఇది ప్రకృతి వైపరిత్యామా లేక ఆ నేత వాస్తు భయమా? తిరుపతి ప్రజలు గతంలో ఎన్నాడూ చూడని వరద ఇక్కట్లు..! ప్రపంచ పటంలో తిరుపతికి ఒక ప్రత్యేకత స్థానం ఉంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభూవై వెలసిన పుణ్యక్షేత్రం. నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు తిరుపతి వస్తుంటారు.…
తిరుపతిలోని శ్రీ కృష్ణా నగర్ లో వింత ఘటన చోటుచేసుకుంది. భూమిలో నుంచి పైకి వచ్చింది 25 అడుగుల తాగు నీటి వాటర్ ట్యాంక్.18 సిమెంట్ ఒరలతో భూమిలో నిర్మించారు వాటర్ ట్యాంక్. భూమి లోపల దిగి మహిళ ట్యాంక్ ను శుభ్రం చేస్తుండగా ఘటన జరిగింది. ట్యాంకు పరిశీలించారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. భయపడి ట్యాంక్ నుంచి బయట పడింది మహిళ. దీంతో ఆ మహిళకు గాయాలయ్యాయి. ఇప్పటికీ భూమిపై నుంచి పైకి వచ్చి…
ప్రకృతికి వ్యతిరేకంగా ఏ పనులు చేయకూడదని, అలా చేసినందు వల్లనే స్వర్ణముఖి నది బ్రిడ్జ్లు, కాజ్ వేలు కొట్టకుపోయానని.. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి పరాకాష్టగా ఆయన అభివర్ణించారు. వరద బాధితులకు సాయం చేసేందుకు ఆయా జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీసీపీ నేతలపై మాటల తూటా లు పేల్చారు. ఇక్కడి నేతలు చెరువులను కబ్జా చేసి క్రికెట్ గ్రౌండ్లు గా మార్చారన్నారు. దీని వల్లనే తిరుపతి మునిగిపోయిందన్నారు. నాలుగు రోజులు ప్రాణాలు అరచేతిలో…
ఒక్క చెరువు వేలాదిమందిని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తిరుపతి రాయలచెరువు తాజా దుస్థితికి వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయలోపమే కారణమంటున్నారు బాధిత గ్రామస్థులు. 10 రోజులు క్రితమే తూములు మూసివేతకు గురైన విషయాన్ని రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకువెళ్ళారు ముంపు గ్రామాల ప్రజలు. రాయలచెరువు వరద ప్రవాహానికి తగ్గట్టుగా నీరు బయటకి వెళ్ళేలా అప్పట్లోనే నాలుగు తూములు ఏర్పాటు చేశారు రాయలవారు. నీటి నిల్వలు ఎక్కువగా వుండాలంటూ ఒక్కటిన్నర తూముని మూసివేశారు దిగువ గ్రామస్థులు.…
నిన్న తిరుమల శ్రీవారిని 18941 మంది భక్తులు దర్శించుకున్నారు. 8702 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అయితే నిన్న హుండి ఆదాయం 1.49 కోట్లు గ ఉంది. అయితే ఇవాళ వరహస్వామి ఆలయంలో మహసంప్రోక్షణకు అంకురార్పణ జరగనుంది. 14 కోట్ల రూపాయల వ్యయంతో వరహస్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేయనున్నారు. రేపటి నుంచి ఐదు రోజులు పాటు సంప్రోక్షన కార్యక్రమాన్ని వైధికంగా నిర్వహించనున్నారు అర్చకులు. ఇక ఇదిలా ఉంటె భారీ వర్షాలతో తిరుమలలో వరదలు…