తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని మూడోసారి నిర్వహించుకుంటున్న తరుణంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. నేడు ఆన్లైన్లో మే నెలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను విడుదల చేయనున్నారు.
తిరుపతి నగర జన్మదినోత్సవ వేడుకల పోస్టర్ను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత పుణ్యక్షేత్రం తిరుపతి నగరానికి మాత్రమే ఆవిర్భావ దినోత్సం జరుపుకుంటామని తెలిపారు. 24-02-1130లో నగరానికి జగద్గురు రామానుజాచార్యులు శంఖుస్థాపన చేశారన్నారు. తిరుపతి అంచెలంచెలుగా ఎదుగుతూ మహానగరంగా మారిందని పేర్కొన్నారు.
తిరుపతి పోలీసులపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన పలువురు పోలీసులపై వేటు వేసింది. అప్పటి ఈస్ట్ సీఐ శివప్రసాద్ రెడ్డి, వెస్ట్ సీఐ శివప్రసాద్ లను సస్పండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. వీరితో పాటు తూర్పు ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథరెడ్డిలను సస్పెండ్ చేసింది. అలిపిరి సీఐ అబ్బన్నను వీఆర్ కు బదిలీ చేశారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక వేళ దొంగ ఓట్ల…
తిరుమలలో శ్రీవెంకటేశ్వర ధార్మిక సదస్సు ముగిసింది. మూడు రోజుల పాటు సాగిన సదస్సులో 62 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు సూచనలు, సలహాలు ఇచ్చారు. మూడు రోజులు పాటు జరిగిన ధార్మిక సదస్సులో అనేక తీర్మానాలు చేశామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
తిరుపతిలో హీరో ధనుష్ సినిమా షూటింగ్ కు సంబంధించి రేపటి అనుమతిని రద్దు చేశారు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రద్దు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా.. రేపు గోవింద రాజస్వామి ఆలయం వద్ద షూటింగ్ చేసి తీరుతామని చిత్ర యూనిట్ ప్రకటించింది. షూటింగ్ చేస్తే అడ్డుకుంటామని, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని బీజేపీ వార్నింగ్ ఇచ్చింది. కాగా.. ఈ వివాదం పెద్దది కావడంతో రేపటి సినిమా షూటింగ్ కు పోలీసులు అనుమతి…