TDP vs Janasena: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న తరుణంలో.. అనూహ్య పరిణామాలు కొనసాగుతున్నాయి.. ఇక, టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా.. జనసేనకు కేటాయించిన తిరుపతిలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. తిరుపతిలో పోటాపోటీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు జనసేన నేతలు.. అధినేత ఆదేశాలు ధిక్కరించి మరి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసేందుకు జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ ప్రయత్నిస్తున్నారు.. హోటల్ ఉదయ్ ఇంటర్నేషనల్ లో స్థానిక జనశ్రేణులతో కిరణ్ రాయల్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.. మరోవైపు.. ఇదే సమయంలో జనసేన అభ్యర్థి ఆరిణి శ్రీనివాసులు ఎన్ జీవో ఆఫీస్ లో ఆత్మీయ సమావేశానికి పిలుపునిచ్చారు.. పార్టీ అభ్యర్థివైపే మెజారిటీ నేతలు ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. పార్టీ ఆదేశాలు ప్రకారం తాము నడుస్తామంటున్నారు తిరుపతి జనసేన కేడర్.. ఆరిణి శ్రీనివాసులు మాతో కలవలేదని అందుకే సమావేశం అంటున్నారు కిరణ్ రాయల్..
Read Also: Om Bheem Bush: వసూళ్ల సునామీ సృష్టిస్తున్న శ్రీవిష్ణు మూవీ.. ఎన్ని కోట్లంటే?
మరోవైపు.. పలుమార్లు ఆరిణి కలవడానికి ప్రయత్నించినా కిరణ్ రాయల్.. సహా పలుపురు నేతలు స్పందించడంలేదని విమర్శలు వినిపించాయి.. ఈ తరుణంలో.. అసంతృప్తితో ఉన్న జనసేన పార్టీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్ ఇంటికి వెళ్లి కలిశారు జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు.. తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.. ఇరువురు నేతల కలయికతో సమస్య పరిష్కారం అవుతుందనే ఆశలో జనసైనికులు ఉన్నారు.. ఈ పరిణామాలు ఇలా ఉండగానే.. మరో పక్క నగరంలో టీడీపీలు రహస్యంగా సమావేశం అయినట్టు తెలుస్తోంది.. టీడీపీ నేత జెబీ శ్రీనివాస్ ఇంట్లో ఈ సమావేశం జరుగుతోంది.. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సహా పలుపురు నేతలు సమావేశంలో పాల్గొనట్టుగా సమాచారం.. జసనేనలో జరుగుతోన్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు టీడీపీ నేతలు.. ఇక, ఆరిణికి టికెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ.. నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.. కన్నీటి పర్యంతమైన విషయం విదితమే కాగా.. ఈ రోజు సమావేశంలో జనసేనకు మద్దతు ఇవ్వాలా? వద్దా? అని చర్చిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.