తమిళనటుడు ధనుష్ నటిస్తోన్న.. వెబ్ సిరీస్ షూటింగ్‌కు అనుమతించిన అధికారులు.. ట్రాఫిక్ మళ్లించారు.. దీంతో.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులు తీవ్ర కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అలిపిరి వద్ద తిరుమల వెళ్లే భక్తులకు కష్టాలు తప్పడం లేదు.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాల్లో స్పీడు పెంచాయి. ఈ క్రమంలో.. తిరుపతిలో యాదవ సంఘాలతో వైసీపీ, టీడీపీ పోటాపోటీ సమావేశాలు నిర్వహించింది. యాదవ, కురుబ సమ్మేళనం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతి నగరం ఎన్నడూ లేని విధంగా మహా నగరంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.
రేపు టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. 2024-25 వార్షిక బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలుపనుంది. 5 వేల కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తిరుపతికి వెళ్లనున్నారు. తిరుపతిలోని తాజ్ హోటల్లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొననున్నారు.
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇవాళ ఆన్లైన్లో టికెట్లను విడుదల చేయనుంది. నేడు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అంగప్రదక్షణ టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. ఏప్రిల్ నెలకు సంబంధించి అంగప్రదక్షణ టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది.
Top 10 richest temples: అయోధ్యలో రేపు రామ మందిర ప్రారంభోత్సవ వేడుక జరగబోతోంది. దాదాపుగా రూ.1800 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది విరాళాలు ఇచ్చారు. రేపు జరగబోయే ప్రాణ ప్రతిష్టకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హాజరవుతున్నారు. 7000 మందికి పైగా అతిథులు, లక్షల్లో ప్రజలు హాజరుకానున్నారు. రామ మందిరానికి వేడుక వేళ భారతదేశంలో 10 అంత్యంత ధనిక దేవాలయాలు ఇవే.. 1) తిరుమల తిరుపతి దేవస్థానం,…
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. రేపటి(గురువారం) నుంచి ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీడీడీ తెలిపింది.