తిరుపతిలో ప్రైవెట్ ట్రావెల్స్ రెచ్చిపోతున్నారు. దీంతో శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రైవేట్ ట్యాక్సీలు, ఆటోవాలాల దందా కొనసాగిస్తున్నారు. టైమ్ స్లాట్ టొకెన్లు ప్రైవేట్ ట్యాక్సీలు, ఆటోవాలాలు భక్తులకు అమ్ముకుంటున్నారు. భక్తులను తీసుకెళ్లి శ్రీవారి మెట్టు మొదట్లోనే ట్యాక్సీలు, ఆటోలు టోకెన్లు తీసుకుని వెనక్కి వచ్చేస్తున్నారు. ఆ టోకెన్లతో బస్సులు, ట్యాక్సీలు, కార్లలో తిరుమలకు భక్తులు చేరుకుంటున్నారు. నడక మార్గంలో వెళ్లే భక్తులకు టోకెన్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో టీటీడీ అధికారులు 1200వ మెట్టు దగ్గర టోకెన్లు జారీ చేశారు. అయితే, నడక మార్గంలో టోకెన్లు పొంది బస్సులు, ట్యాక్సీలలో వెళుతున్న వారిని అరికట్టాలని భక్తులు కోరుతున్నారు.
Read Also: Ice Apple : వేసవిలో తాటి ముంజలను తింటున్నారా? ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
అయితే, ఇప్పటికే 6 వేల నుంచి రెండు, మూడు వేలకు టైమ్ స్లాట్ టొకెన్లు తిరుమల తిరుపతి దేవస్థానం కుదించింది. ఈ అక్రమ దందాను అరికట్టాలని నడక మార్గం భక్తులు డిమాండ్ చేశారు. ప్రైవేట్ ట్యాక్సీలు, ఆటోలు ఇలా చేయడం వల్ల తమకు తీవ్ర ఇబ్బంది కలుతుందని శ్రీవారి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా టీటీడీ అధికారులు స్పందించి ఇలాంటి వారిని వెంటనే కట్టడి చేయాలని కోరుతున్నారు.