తిరుపతి జిల్లాలో మొత్తం 2,136 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. ఇక, జిల్లా వ్యాప్తంగా 17, 94, 733 మంది ఓటర్లు ఉన్నారు.. అందులో పురుష ఓటర్లు – 8,74,738 మంది ఉండగా, స్త్రీలు – 9,19,817 మంది ఉన్నారు. ఇక, యువ ఓటర్లు – 36,162మంది ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. వీల్ చైర్ కే పరిమితమైన వారు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం ఉంది.. సి.విజల్ యాప్ ద్వారా ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకుంటాం.. యువ ఓటర్లలో చైతన్యం రావాలి అని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండి ఓటు హక్కును పొందిన ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవాలి.. 48 గంటల్లో రాజకీయ పార్టీ నేతల ఫ్లెక్సీలు, స్టిక్కర్లను తొలగిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు.
Read Also: Top Headlines @ 5 PM : టాప్ న్యూస్
ఇక, కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించామని తిరుపతి జిల్లా ఎస్పీ క్రిష్ణకాంత్ పటేల్ పేర్కొన్నారు. 4 వేల మంది పోలీసులు ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు.. రౌడీ షీటర్లను ఇప్పటికే బైండోవర్ చేశాం.. రౌడీషీటర్ల వద్ద ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం.. సమస్యాత్మక పోలింగ్ బూత్ లను గుర్తించాం..కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామన్నారు.