Arani Srinivasulu: నేను వైసీపీ కోవర్టును కాదు.. పవన్ నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arani Srinivasulu: వైసీపీకి గుడ్‌బై చెప్పిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.. జనసేన పార్టీలో చేరిన విషయం విదితమే.. జనసేనాని పవన్ కల్యాణ్‌తో భేటీ అయినందుకు వైసీపీ ఆయన్ని సస్పెండ్ చేయడం.. ఆ తర్వాత ఆరణి శ్రీనివాసులు పవన్ సమక్షంలో జనసేనలో చేరడం.. ఇక ఆ తర్వాత ఆయనకు టికెట్ దక్కడం అన్నీ వెనువెంటనే జరిగిపోయాయి.. అయితే, ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నారు ఆరణి.. అందులో భాగంగా.. ఈ రోజు తిరుపతి ఎన్.జి.ఓ.కాలనీలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ.. తిరుపతి వాసులకు సేవ చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.. శ్రీవారి పాదాల చెంత కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం.. 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటాను అని స్పష్టం చేశారు.
Read Also: Weightloss Tips : ఈ టిప్స్ ఫాలో అయితే సులువుగా బరువు తగ్గుతారు..
Also Read
- PM Modi: కాంగ్రెస్‌కు ‘‘జీరో’’ సీట్లు.. ప్రధాని మోడీ సెటైరికల్ పోస్ట్..
- Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- Supreme Court: ఫామ్ 6, 7, 8లను మార్చలేరు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు..
- Artificial Paneer Ban in AP: ఏపీలో పన్నీరు అమ్మకాలు బంద్..! ఏడాది పాటు నిషేధం
ఇక, నేను నాన్ లోకల్ కాదు.. లోకలే అన్నారు ఆరణి.. 2009లోనే పద్మావతిపురంలో నాకు సొంత ఇళ్లు ఉందన్న ఆయన.. తిరుపతి ప్రజలకు దగ్గరగా ఉంటూనే వచ్చాను.. కానీ, కొంతమంది నాపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవర్టును కాదు.. పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరాను.. నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను అని స్పష్టం చేశారు. మరోవైపు ఐదేళ్ల వైసీపీ పాలన మొత్తం అవినీతిమయం.. తిరుపతి పుణ్యక్షేత్రాన్ని గంజాయి వనంగా మార్చారు అని ఆరోపించారు. వైసీపీ హయాంలో తిరుపతి ఎమ్మెల్యే, ఆయన కుమారుడు చేసిన అక్రమాలు అందరికీ తెలుసన్నారు. తిరుపతి ప్రజలు ఒక్కసారి ఆలోచించండి.. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఆరణి శ్రీనివాసులు.
తాజావార్తలు
-
PM Modi: కాంగ్రెస్‌కు ‘‘జీరో’’ సీట్లు.. ప్రధాని మోడీ సెటైరికల్ పోస్ట్..
-
Venus Rise : అక్టోబర్ 29 నుంచి శుక్రుడి ప్రభావం.. ఆ రాశుల వారు జాగ్రత్త
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Supreme Court: ఫామ్ 6, 7, 8లను మార్చలేరు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు..
-
Artificial Paneer Ban in AP: ఏపీలో పన్నీరు అమ్మకాలు బంద్..! ఏడాది పాటు నిషేధం
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!