ఒక్క బిర్యానీ తిని ఏడు లక్షల రూపాయల కారు గెలుచుకున్నాడు ఓ లక్కీ ఫెలో. తిరుపతి నగరంలోని రోబో హోటల్లో నిర్వహించిన బిర్యాని లక్కీ డ్రా లో రాహుల్ అనే వ్యక్తి నిస్సాన్ మాగ్నట్ కారు ఉచితంగా పొందాడు.
తిరుమలలో ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. శనివారం వేకువజామున 1.30 గంటలకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తం శ్రీవారి ఆలయానికి ప్రక్కనే ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ముందుగా శ్రీనివాసుడికి నిత్య కైంకర్యాలు, తిరుప్పావై పఠనం చేసిన తర్వాత భక్తులను వైకుంఠ ద్వారం గుండా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతించారు.
వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులకు అనుమతిస్తారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం నేటి మధ్యాహ్నం 2గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు కేటాయించాలని టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
తిరుమల శ్రీవారి భక్తులను వన్యమృగాల భయం వీడడం లేదు. ఇటు టీటీడీ, అటు అటవీశాఖ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా జనావాసాల్లోకి జంతువులు చొరబడుతూనే ఉన్నాయి.
పవిత్ర పుణ్యక్షేత్ర తిరుమలకు నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని కనులారా దర్శించుకొసే అదృష్టం.. ప్రార్థించే అవకాశం కోసం కోట్ల మంది ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే భక్తుల సౌకర్యం కోసం.. టీటీడీ అనేక రకాల చర్యలు చేపడుతోంది.
మిచౌంగ్ తుఫాన్‌తో ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది? ఎంత ఆస్తి నష్టం జరిగింది? అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించనుంది సెంట్రల్ టీమ్. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పంట నష్టాన్ని అంచనా వేస్తారు.
తిరుపతిలోని సుబ్బారెడ్డి నగర్లో కిషోర్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.. ఈ హత్య ఎందుకు? జరిగింది? ఎవరి పని కావొచ్చు అనేదానిపై పోలీసుల చెబుతున్న వివరాల ప్రకారం.. తనకు పరిచయం ఉన్న యువతిన వేధిస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చాడట కిషోర్.. మరోసారి ఆ యువతి జోలికి రావొద్దని హెచ్చరించాడట.. దీంతో, కిషోర్‌కు ఆ పోకిరీల మధ్య చిన్నపాటి వివాదం చోటు చేసుకుఒంది.. అది కాస్తా ఘర్షణకు దారితీసింది.. ఆ తర్వాత కత్తులతో కిషోర్‌పై దాడిచేసి చంపేశారు…
క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధం అయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రేపు మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించబోతున్నారు.. అందులో భాగంగా ముందుగా తిరుపతి, బాపట్ల జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.