తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఆస్థానం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా నేడు సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు.
వర ప్రసాదరావు మాట్లాడుతూ.. వైసీపీకి ఆదరణ లేనప్పుడు కష్టకాలంలో పార్టీలో చేరాన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేరలేదు.. ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశాను.. దళితుడి నాయకత్వాన్ని ఓర్చుకోలేక సీఎం కుట్ర చేశారు అని ఆయన ఆరోపించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు (ఏప్రిల్ 9న) శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఓ ప్రకటనలో తెలిపింది.
తిరుమల నడకదారిలో మరో సారి చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత ఏడాది తిరుమల కాలి నడక మార్గంలో చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక, ఈ ఘటనతో తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) అధికారులు అలర్ట్ అయ్యారు.