Tollywood: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టార్స్ ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఇటీవల విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ బంధంతో ఒకటి కావడంతో, సోషల్ మీడియాలో మరోసారి పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి. టాలీవుడ్లో ఇంకా సింగిల్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తూ, వరుస సినిమాలతో కెరీర్‌ను పరుగులు పెట్టిస్తున్న ఆ స్టార్ హీరోలు ఎవరో వారి ప్రస్తుత ప్రాజెక్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.
1. ప్రభాస్: 45 దాటినా తగ్గని క్రేజ్
Also Read
- I Am Game: జియోహాట్‌స్టార్‌లోకి దుల్కర్ సల్మాన్ 'ఐ యామ్ గేమ్'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
- Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
- Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
- Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంటుంది. 45 ఏళ్లు దాటినా పెళ్లి కంటే సినిమాకే మొగ్గు చూపుతున్నారాయన. ప్రస్తుతం ‘కల్కి’ సీక్వెల్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ వంటి భారీ ప్రాజెక్టులతో ప్రభాస్ డైరీ ఫుల్ బిజీగా ఉంది. అప్పుడప్పుడు పెళ్లి వార్తలు వినిపిస్తున్నా, అవన్నీ ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే మిగిలిపోయాయి.
2. రామ్ పోతినేని: రూమర్స్ కు చెక్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి ఇప్పుడు 38 ఏళ్లు. గతంలో రామ్ పెళ్లి గురించి అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి, కానీ అవన్నీ పుకార్లేనని తేలిపోయింది. ప్రస్తుతం రామ్ తన తదుపరి చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ‘ఆంధ్రా కింగ్’ తర్వాత మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తూ కథల ఎంపికలో బిజీగా ఉన్నారు.
3. సాయి దుర్గా తేజ్: కెరీర్‌పైనే ఫోకస్
‘విరూపాక్ష’తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న సాయి దుర్గా తేజ్, ప్రస్తుతం తన వర్క్ మీద పూర్తి శ్రద్ధ పెడుతున్నారు. పెళ్లి వార్తలు ఒకవైపు వినిపిస్తున్నా, ఆయన మాత్రం షూటింగ్స్ లో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read:Bollywood : మలయాళ రీమేక్స్ మోజులో చేతులు కాల్చుకుంటున్న బాలీవుడ్
4. నవీన్ పోలిశెట్టి: కామెడీ కింగ్ సింగిల్ స్టేటస్
వరుస రొమాంటిక్ కామెడీలతో ప్రేక్షకులను నవ్విస్తున్న నవీన్ పోలిశెట్టి వయస్సు 40 దాటినా, ఇంకా పెళ్లి పీటలు ఎక్కలేదు. ప్రాజెక్ట్స్ విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉండే నవీన్, ప్రస్తుతం తన చేతిలో ఉన్న కొత్త సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయనకు సినిమానే ప్రస్తుతానికి ఫస్ట్ ప్రయారిటీ.
5. సందీప్ కిషన్: సైలెంట్ గా దూసుకుపోతూ..
తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ కిషన్. కెరీర్ గ్రాఫ్ ను పెంచుకునే పనిలో ఉన్న ఈ యంగ్ హీరో, పెళ్లి ప్రస్తావన వస్తే మాత్రం చాలా సైలెంట్ గా ఉంటున్నారు. తన నటనతో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ముందుకు సాగుతున్నారు.
Also Read:Vishnu Vinyasam : మిక్స్డ్ టాక్’తో 3 రోజుల్లో 14.7 కోట్లు కొల్లగొట్టిన శ్రీ విష్ణు
6. బెల్లంకొండ శ్రీనివాస్: మాస్ అండ్ క్లాస్
‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్లో అడుగుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్, ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా ఉన్నారు. ‘హైందవ’, ‘టైసన్ నాయుడు’ వంటి యాక్షన్ ప్యాక్డ్ సినిమాలతో బిజీగా ఉన్న శ్రీనివాస్, ఇంకా సింగిల్ గానే ఉంటూ తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంటున్నారు.
వరుసగా స్టార్ హీరోలు ఓ ఇంటివారవుతుండటంతో, ఇప్పుడు ఈ స్టార్స్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!
-
Big Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి ముంచుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు..
-
Rajasthan: 40 విల్లాలు, కాటేజీలు.. IAS-IPS దంపతుల అవినీతి బాగోతం..
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డులు.. భారత క్రికెట్లో మరో కొత్త చర్చ..
-
I Am Game: జియోహాట్‌స్టార్‌లోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!