తిరుమల నడకదారిలో మరో సారి చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత ఏడాది తిరుమల కాలి నడక మార్గంలో చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక, ఈ ఘటనతో తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) అధికారులు అలర్ట్ అయ్యారు.
తిరుపతి జిల్లాలో మొత్తం 2,136 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. ఇక, జిల్లా వ్యాప్తంగా 17, 94, 733 మంది ఓటర్లు ఉన్నారు.. అందులో పురుష ఓటర్లు - 8,74,738 మంది ఉండగా, స్త్రీలు - 9,19,817 మంది ఉన్నారు.
ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో స్పల్పంగా భూప్రకంపనలు సంభవించాయి. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, ఓజిలి, దొరవారిసత్రం, పెళ్లకూరు మండలాలలో స్వల్పంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
తిరుపతిలోని రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ ఆశ్రమ నిర్వాహకుడితో పాటు మరో యువకుడిపై పోలీసులు ఫోక్సో కేసును నమోదు చేశారు.