Leopard: తిరుమల నడకమార్గంలో మళ్లీ కలకలం.. ఐదు సార్లు చిరుత సంచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leopard: తిరుపతి – తిరుమల నడకమార్గంలో మళ్లీ చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.. చిరుత ఓ బాలుడిపై దాడి చేయడం.. మరో చిన్నారి ప్రాణాలు తీసిన తర్వాత.. చిరుతలతో పాటు ఇతర అటవీ జంతువుల కదలికలను పసిగట్టేందుకు ఫారెస్ట్ అధికారులతో కలిసి చర్యలకు దిగిన టీటీడీ.. ప్రత్యేకంగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి.. వాటి కదలికలను గుర్తించి బోన్‌లను ఏర్పాటు చేస్తూ.. వాటిని బందిస్తూ వచ్చింది.. అయితే, ఇప్పుడు మళ్లీ చిరుతల సంచారం మొదలైనట్టు అధికారులు చెబుతున్నారు.. తిరుమలలో ఈరోజు మీడియాతో మాట్లాడిన డీఎఫ్‌వో సతీష్ రెడ్డి.. నడకదారిలో చిరుతల సంచారం కొనసాగుతుందన్నారు.. అయితే, ఫిబ్రవరి నెలలో చిరుతల కదలికలు కనిపించలేదని.. కానీ, మార్చి నెలలో ఐదు సార్లు చిరుత కనిపించినట్టు వెల్లడించారు. అధునాతనమైన ట్రాప్ కెమెరాల ఏర్పాటుతో ఎప్పటికప్పుడు చిరుత కదలికలు గుర్తించి.. సిబ్బందిని అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. ఇక, ఏప్రిల్ నెలలో సెంట్రల్ వైల్డ్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌తో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతాం.. వారి సూచనలతో నడకదారిలో జంతువుల సంచారానికి అనువుగా ఏర్పాట్లు చేస్తాం అని వెల్లడించారు డీఎఫ్‌వో సతీష్ రెడ్డి.
Read Also: Komatireddy: హరీష్ రావ్ బీజేపీలో చేరడం ఖాయం.. కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!