Leopard: హడలెత్తిస్తున్న చిరుతలు.. తిరుమల, తిరుపతిలో కలకలం
- శ్రీవారి భక్తులను హడలెత్తిస్తున్న చిరుతలు..
- తిరుమల, తిరుపతిలో చిరుతల సంచారం..
- భక్తులు, స్థానికులకు కంటిమీద కునుకు కరువు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leopard: టెంపుల్ సిటీ కేంద్రంగా శ్రీవారి భక్తులను, నగరవాసులను చిరుతలు హడలెత్తిస్తున్నాయి… నిత్యం తిరుమల, తిరుపతిలో చిరుతల సంచారం కంటిమీదా కునుకులేకుండా చేస్తున్నాయి.. నిన్న తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే.. తిరుమల శిలాతోరణం వద్ద నిన్న సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే, ప్రస్తుతం సర్వదర్శన టోకెన్ల క్యూలైన్ సమీపంలోని అటవీ ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. తాజాగా తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. గత రాత్రి సమయంలో యూనివర్సిటీ ఆవరణలో చిరుత.. ఓ కుక్కను వేటాడి ఎత్తుకెళ్లడంతో విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు.. దీంతో యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది, స్కాలర్స్, హాస్టల్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. అయితే గత నెల రోజులుగా యూనివర్సిటీలో చిరుత కదలికలు ఉన్నాయంటూ ఫ్లెక్సీలు అక్కడ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా చిరుతను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు.
Read Also: Pooja Hegde: దాని నుంచి బయటపడటానికి సమయం పడుతుంది : పూజా హెగ్డే
Also Read
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!