Tirumala: తిరుమలలో దంపతుల ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది.. శ్రీవారి దర్శనానికి వచ్చిన దంపతులు తిరుమల కాటేజీలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు నాయుడు (60), ఆయన భార్య అరుణ (55) తిరుమల శ్రీవారి దర్శానికి వచ్చారు. నందకం అతిథి గృహంలోని గది నెంబర్ 203ను అద్దెకు తీసుకున్నారు. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వచ్చి కాటేజీలో ఆత్మహత్య చేసుకోవటం, అందులోనూ భార్యాభర్తలు ఇలా తిరుమలలో చనిపోవాలని నిర్ణయించుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య సమాచారాన్ని తిరుపతిలో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. పిల్లలు, బంధువులు కొండకు వచ్చి పోలీసుల విచారణకు హాజరయ్యారు.
Read Also: Police Interrogating RGV: పోలీసుల విచారణ.. అది నిజమేనని ఒప్పుకున్న ఆర్జీవీ..!