Tirupati Election: డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ.. క్యాంప్ రాజకీయాలతో రసవత్తర పరిణామాలు
- నేడు (ఫిబ్రవరి 3) ఉదయం 11 గంటలకు తిరుపతి నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ ఎన్నిక.
- డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ..
- క్యాంప్ రాజకీయాలతో రసవత్తర పరిణామాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati: తిరుపతి నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ ఎన్నిక నేడు (ఫిబ్రవరి 3) ఉదయం 11 గంటలకు ఎస్‌వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరగనుంది. భూమన అభినయ రెడ్డి రాజీనామాతో ఖాళీగా మారిన ఈ పదవికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తన పట్టును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, ప్రతిపక్ష కూటమి ఈ స్థానంపై కన్నేసింది. ఈ నేపథ్యంలో నగరంలో తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు, క్యాంప్ రాజకీయాలు ముదిరాయి. దీనితో గత మూడు రోజులుగా తిరుపతిలో క్యాంప్ రాజకీయాలు ఉధృతంగా సాగాయి. వైసీపీ కార్పొరేటర్లు పాండిచ్చేరి క్యాంప్‌లో ఉండగా, వారు కొద్దిసేపటి క్రితమే తిరుపతికి చేరుకున్నారు. మరోవైపు, చిత్తూరులో బసచేసిన వైసీపీ కార్పొరేటర్లను రాత్రి తిరుపతి టీడీపీ నేతలు కలిసే ప్రయత్నం చేయడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. విషయం తెలుసుకున్న భూమన అభినయ రెడ్డి హుటాహుటిన చిత్తూరుకు చేరుకుని తన పార్టీ కార్పొరేటర్లను తిరుపతిలోని తన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడి నుంచే నేరుగా ఎన్నికల కేంద్రానికి వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
Also Read: Elections In AP: నేడు రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు హోరాహోరీగా ఎన్నికలు
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
వైసీపీ గత ఎన్నికల్లో 48 కార్పొరేటర్లను గెలుచుకున్నప్పటికీ, ఇప్పటికే 20 మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమి వైపు వెళ్లినట్లు సమాచారం. మరోవైపు, పళ్ళిపట్టు సమీపంలోని రేవా రిసార్ట్స్‌లో ఉండిన కూటమి కార్పొరేటర్లు ఈ ఉదయం తిరుపతికి బయలుదేరారు. వీరంతా ఎన్నికల కేంద్రానికి చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు ఎన్నికల్లో 47 మంది కార్పొరేటర్లతో పాటు తిరుపతి ఎమ్మెల్యే, తిరుపతి ఎంపీ, ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించనున్నారు. మొత్తంగా 50 ఓట్లు ఉండగా, గెలుపు కొరకు 26 ఓట్లు అవసరం. అయితే, ప్రస్తుతం ఏ క్యాంపులో ఎంతమంది ఉన్నారన్న దానిపై స్పష్టత లేకపోవడంతో ఎన్నికల ఫలితం గూఢరహస్యంగా మారింది.
ఈ ఉదయం 11 గంటలకు ఎన్నికలు ప్రారంభంకానుండగా, డిప్యూటీ మేయర్ ఎవరవుతారన్న దానిపై ఉత్కంఠ మరింత పెరిగింది. అధికార వైసీపీ తన సీటును నిలబెట్టుకుంటుందా, లేక విపక్ష కూటమి ఈ పదవిని చేజిక్కించుకుంటుందా అన్నది కొద్ది గంటల్లో తేలనుంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!