ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గుర్రపుశాల గ్రామంలో విచిత్ర దొంగతనాన్ని బయట పెట్టారు పోలీసులు.. పిల్లను ఇచ్చి పెళ్లి చేసిన ఊరికే కన్నం వేశాడు ఓ అల్లుడు.. దొంగగా మారి.. వరుసగా దొంగతనాలకు పాల్పడ్డాడు.. చూడటానికి విచిత్రంగా ఉన్న అల్లుడే దొంగగా మారి 12 ఇళ్లల్లో దొంగతనం చేసి పోలీసులకు దొరికి.. చివరకు కటకటాల లెక్క పెడుతున్నాడు ముండ్ల రాయమ్య అనే దొంగ అల్లుడు..
సాధారణంగా దొంగలు ఇంట్లోని డబ్బు, నగలను దొంగిలిస్తుంటారు. ఏమీ దొరకని సమయంలో విలువైన వస్తువులను ఎత్తుకెళుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో కొందరు ఇంటి బయట ఆరేసిన బట్టలను కూడా దొంగలించారు. ఇదే వింత అనుకుంటే.. తాజాగా మరో వింత చోటుచేసుకుంది. ఇంటి బయట వదిలిన షూస్ ఎత్తుకెళుతున్నాడో వింత దొంగ. 100కు పైగా ఇళ్లలో షూస్ దొంగతనం చేసి.. చివరకు పట్టుపడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో చోటుచేసుకుంది. ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మల్లేష్…
ఓ దొంగను పట్టుకుని చేతులు, కాళ్లు కట్టేసి చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసిన ఘటన రాజస్థాన్‌లోని బుండిలో చోటు చేసుకుంది. ఆ ఊర్లో ఉన్న పొలాల వద్ద నుంచి దొంగ కేబుల్స్ ఎత్తుకెళ్తున్నాడు. ఈ క్రమంలో స్థానికులు అతన్ని దొరకబట్టి చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసి కొట్టారు.
Robbery: మహారాష్ట్రలోని పూణెలో కేబుల్స్ దొంగిలించడానికి విద్యుత్ టవర్ ఎక్కిన యువకుడు పడిపోవడంతో మరణించాడు. ఆ తర్వాత అతని స్నేహితులు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పాతిపెట్టారు. విషయం తెలియగానే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరణించిన యువకుడి పేరు బసవరాజ్ మంగ్రుల్ (22). అతను పూణెలోని సింగఢ్ రోడ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతని కుటుంబ సభ్యులు మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో విచారణలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. Minister Seethakka: కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం హేయం.. వైద్యులకు…
ఈ దొంగ మామూలోడు కాదండోయ్.. గుజరాత్ పోలీసులు ఇటీవల అనేక రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడిన ఓ దొంగను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత నెలలో రోహిత్ కానుభాయ్ సోలంకి వాపిలో లక్ష రూపాయల చోరీ కేసులో పోలీసుల వలకు చిక్కాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ఓ వ్యక్తి వీడియో తీసి దంపతులను బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిజానికి.. ఆ వ్యక్తి చాలాసార్లు సివిల్ సర్వీస్ (PSC) పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకున్నాడు. కానీ అతను బార్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత అతను డబ్బు సంపాదించడానికి తప్పు మార్గాలను ఎంచుకున్నాడు. ఆ వ్యక్తి ఓ జంటకు సంబంధించిన ప్రైవేట్ వీడియోను చిత్రీకరించి, వారిని బ్లాక్ మెయిల్ చేసి రూ.10 లక్షలు తీసుకోవడానికి ప్రయత్నించాడు.
ఇళ్లకు కన్నాలేసే దొంగలు చాలా అలర్ట్‌గా ఉంటారు. రాత్రి పూట అందరూ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఎవరికీ డౌట్ రాకుండా దోచుకుని వెళ్లిపోతుంటారు. రాత్రి దొంగతనం చేసే దొంగ నిద్రకు కక్కుర్తి పడితే అడ్డంగా దొరికిపోక తప్పదు. నిద్రలోకి జారకుని ఇంట్లో వాళ్లకు దొరికాడంటే ఆ దొంగ పని అంతే ఇంక. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సరిగ్గా ఇదే జరిగింది.
బ్యాగ్‌లు అమ్మే నెపంతో ఓ ఇంట్లోకి నిశ్శబ్దంగా లోపలికి ప్రవేశించిన దొంగ.. చిన్నారిని చంకలో పెట్టుకుని పారిపోయాడు. స్థానికులు అతని కోసం వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని రుద్రనగర్ లో చోటు చేసుకుంది. ఈ విషయంపై చిన్నారి తల్లి షీలా బధోయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాము కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని తెలిపింది.