Ramanthapur Thief: రామంతపూర్‌లో కొట్టేస్తాడు.. ఎర్రగడ్డలో అమ్మేస్తాడు! మరో ట్విస్ట్ ఏంటంటే?
- రామంతపూర్‌లోవింత దొంగ
- 100కి పైగా ఇళ్లల్లో దొంగతనం
- మరో ట్విస్ట్ ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా దొంగలు ఇంట్లోని డబ్బు, నగలను దొంగిలిస్తుంటారు. ఏమీ దొరకని సమయంలో విలువైన వస్తువులను ఎత్తుకెళుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో కొందరు ఇంటి బయట ఆరేసిన బట్టలను కూడా దొంగలించారు. ఇదే వింత అనుకుంటే.. తాజాగా మరో వింత చోటుచేసుకుంది. ఇంటి బయట వదిలిన షూస్ ఎత్తుకెళుతున్నాడో వింత దొంగ. 100కు పైగా ఇళ్లలో షూస్ దొంగతనం చేసి.. చివరకు పట్టుపడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో చోటుచేసుకుంది.
ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మల్లేష్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా రామంతపూర్ పరిధిలో ఇంటి బయట వదిలిన షూస్ దొంగతనం చేస్తున్నాడు. ప్రతి రోజు కొత్త కొత్త షూస్ ఎత్తుకెళుతున్నాడు. ఇప్పటికే 100కు పైగా ఇళ్లలో షూస్ దొంగతనం చేశాడు. షూస్ మాయం అవుతుండటంతో.. రామంతపూర్ వాసులు నిఘా పెట్టారు. కాపు కాసి మరీ షూస్ దొంగ మల్లేష్‌ను పట్టుకున్నారు. అతడిని చితకబాది.. ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.
Also Read
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
Also Read: Gabba Test: గబ్బా టెస్ట్.. వ్యూహం మార్చిన టీమిండియా!
ఉప్పల్ పోలీసులు మల్లేష్‌పై కేసు నమోదు చేసి విచారించగా అసలు విషయం తెలిసింది. రామంతపూర్‌లో కొట్టేసిన షూస్‌ను ఎర్రగడ్డ మార్కెట్లో రూ.100, రూ.200కి అమ్ముతున్నా అని తెలిపాడు. దాంతో పోలీసులు కంగు తిన్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఇటీవల మద్యం మత్తులో వచ్చి పోలీస్ స్టేషన్‌లో హల్చల్ చేసిన మహిళ.. మల్లేష్ భార్యగా పోలీసులు గుర్తించారు. ‘బరాబర్ తాగిన సర్’ అని పోలీసులతో ఓ మహిళ అంటున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!