పెళ్లి అంటేనే ఎంతో సందడి.. కోలాహలం ఉంటుంది. బంధు, మిత్రుల రాకపోకలతో హడావుడిగా ఉంటుంది. మొత్తానికి పెళ్లంటేనే ఒక ఉత్సవంలా ఉంటుంది. అయితే పెళ్లి వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. పెళ్లికొచ్చిన ఓ యువకుడు దారి తప్పడు. అంతేకాకుండా మద్యం మత్తులో ఉన్నాడు. ఎక్కడికెళ్తున్నాడో అర్థం కావడం లేదు. ఊరు కాని ఊరు. మద్యం మైకంలో ఉన్నాడు. అంతే స్థానికుల చేతిలో చిక్కాడు. ఇంకేముంది.. దొంగగా భావించి చావబాదారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Election Commission: మహారాష్ట్ర ఎన్నికల అనుమానాలపై కాంగ్రెస్‌కి ఈసీ ఆహ్వానం..
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి పొరుగున ఉన్న డియోరియా జిల్లాలోని తార్కుల్వా గ్రామంలో బుధవారం రాత్రి వివాహ ఊరేగింపు జరుగుతోంది. ఆ పెళ్లికొచ్చిన బంధువు.. పొరపాటున దారి తప్పాడు. పైగా మద్యం మైకంలో ఉండి.. ఓ ఇంటి తలుపు తట్టాడు. ఇంకేముంది దొంగగా భావించి.. స్థానికులు విద్యుత్ స్తంభానికి కట్టేసి చావబాదారు. అంతకముందు రోజే.. ఆ కాలనీలో చోరీ జరిగింది. మళ్లీ దొంగలు పడ్డారేమోనన్న అనుమానంతో పెళ్లి ఊరేగింపు నుంచి దారి తప్పిన బంధువును దొంగగా భావించి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు.. తీవ్రగాయాలు పాలైన బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి ఊరేగింపులో దారి తప్పిపోయాడని పోలీసులు తెలిపారు. స్థానికులేమో దొంగగా భావించి కొట్టారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Minister Bala Veeranjaneya Swamy: దేశంలోనే అత్యధిక పింఛన్లు ఏపీలోనే.. ప్రభుత్వంపై నింధలు సరికాదు..
#देवरिया के पथरदेवा कस्बे में बुधवार रात गोरखपुर से आई एक बारात के दौरान, नशे की हालत में एक युवक रास्ता भटक गया। स्थानीय लोगों ने उसे चोर समझकर पकड़ लिया और बुरी तरह पीटा। @DeoriaPolice pic.twitter.com/lGkxrUT6QV
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) November 30, 2024