బైక్ దొంగిలిచాడని చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన బీహార్‌లోని వైశాలిలో జరిగింది. స్థానికులు చెట్టుకు కట్టేసి రక్తమొచ్చేటట్టు చితకబాదారు. అతన్ని అలా కొడుతుండగా.. కొందరు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని చెట్టు నుంచి విడిపించారు.
Vijayawada Police: ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేదంటారు. కానీ బెజవాడ పోలీసులు మాత్రం ఇంటి దొంగను ఇట్టే పట్టేసి జనాల చేత శభాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో పెరుగుతున్న పోలీసు ఎన్‌కౌంటర్ల కారణంగా ప్రాణ భయంతో, మోటార్ సైకిల్ దొంగల ముఠా సభ్యుడు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని మన్సూర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో చేతిలో ప్లకార్డు పట్టుకుని లొంగిపోయాడు.
తెలంగాణ రాష్ట్రంలో దొంగతనాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. చెడ్డీ గ్యాంగ్ సందడి చేసేది.. ఇప్పుడు బాలికల హాస్టళ్లలో చోరీలకు పాల్పడడం సంచలనంగా మారింది. ఇలా జరగడం ఇది నాలుగోసారి కావడం కలకలం రేపుతోంది. భద్రత ఉన్నప్పుడల్లా బాలికల హాస్టళ్లలో కూడా దొంగతనాలు జరుగుతున్నాయంటే తెలంగాణలో దొంగలు ఎక్కువగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు.
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న వరుస దొంగతనాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. దేవాలయాలే టార్గెట్ గా.. ఏడాదిన్నర కాలంలో మూడు సార్లు ఆలయాల్లో చోరీలు జరిగాయి. తాజాగా మండలంలోని రెండు ఆలయాల్లో గత రాత్రి చోరీ జరిగింది.