పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పెన్షన్ వచ్చిందని వృద్ధురాలిని నమ్మించి మెడలో ఉన్న మూడు తులాల పుస్తెలతాడు చోరీ చేశాడు ఓ అగంతకుడు. మాయ మాటలు చెప్పి రూ. 4,000 పెన్షన్ మంజూరు అయ్యిందని ఫొటో దించాలని నమ్మబలికి దొంగతనానికి పాల్పడ్డాడు. వృద్ధురాలితో మాట్లాడిన దృశ్యాలు సీసీ ఫుటేజిలో రికార్డు అయ్యాయి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు శంకరమ్మ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read:Hamas:…
అప్రమత్తంగా లేకపోతే నష్టం ఏ రేంజ్ లో ఉంటుందో ఈ ఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఓ ప్రయాణికుడి నుంచి సెల్ ఫోన్ కొట్టేసిన దొంగ.. అకౌంట్ నుంచి రూ. 6 లక్షలు విత్ డ్రా చేసి షాక్ ఇచ్చాడు. బోయిన్ పల్లిలో నిజామాబాద్ బస్ ఎక్కుతుండగా ప్రసాద్ రావు అనే ప్రయాణికుడి సెల్ ఫోన్ చోరీ చేశాడు ఓ దొంగ.. చోరీ కి గురైన మొబైల్ ఫోన్ లో బ్యాంక్ యాప్ ద్వారా రూ. 6 లక్షలు…
Shocking Incident at Jagtial Girls’ Junior College: దొంగల్లో కూడా ‘వెరైటీ దొంగ’ ఏంట్రా అని అనుకుంటున్నారా?. దొంగతనం చేయడం నేరమే అయినా.. అందులో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు దొంగలు బంగారం, డబ్బు దోచేస్తారు. మరికొందరు ఇంట్లోని విలువైన వస్తువులు కొట్టేస్తాడు. ఇంకొందరు అయితే బట్టలు, చెప్పులు సర్ధేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకునే దొంగ విలువైన వస్తువులు ఏవీ ముట్టుకోడు. కేవలం బుక్స్ మాత్రమే దొంగతనం చేస్తాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ…
అవును.. అతడు ఏటీఎంలను ఏమార్చుతాడు.. చదువురాని వాళ్లని టార్గెట్ చేస్తాడు.. ఏటీఎం నుంచి డబ్బు తీసి ఇస్తానని నమ్మించి, తర్వాత అవతలి వ్యక్తి ఏటీఎంను కొట్టేసి మరోచోట డబ్బులు నొక్కేస్తాడు. ఇలా ఒకటా రెండా.. ఏకంగా 300కు పైగా ఏటీఎం కార్డులను నొక్కేసి లక్షలాది రూపాయలు కొట్టేసాడు. అతడే విద్యాసాగర్ అనే మోసగాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో దొంగతనాలకు పాల్పడినట్లు రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు కనుగొన్నారు. ఒక కేసులో నిందితుడిని పట్టుకొని ఆరా తీయడంతో జరిగిన…
పెళ్లికి వచ్చాడు.. అందరితో పాటు భోజనం చేశాడు.. అయితే, అతడి టార్గెట్ మాత్రం వేరు..పెళ్లిలో కలియతిరుగుతూనే అంతా గమనించసాగాడు.. చివరకు చదివింపుల సొమ్ము దాచిన బ్యాగ్‌తో ఉడాయించాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉడతా వారి కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. ఉడతా వెంకట్రావు తనయుడు రమేష్ పెళ్లికి ఆహ్వానించిన వారంతా వచ్చారు. బంధువులు, స్నేహితులు రాకతో కల్యాణ మండపం సందడిగా మారింది. వచ్చిన బంధువులంతా వధువరూలను ఆశీర్వదించి విందు ఆరగించి వెళ్తున్నారు. అటు తర్వాత ఉడతా…
DK Aruna : ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఆందోళన చెలరేగింది. అర్ధరాత్రి ఓ దొంగ ఇంట్లోకి రావడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 56లోని ఆమె ఇంట్లో చొరబడిన దొంగ గంటన్నర సేపు ఇంట్లోనే సంచరించాడని హౌస్ మెయింటేనెన్స్ ఇన్ చార్జి లక్ష్మణ్ తెలిపారు. ‘తెల్లవారు జామున 3 గంటలకు దొంగ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. కిచెన్ దగ్గర అలజడి రావడంతో మేము మేల్కొన్నాం. అతను రెండు చేతులకు గ్లౌస్ లు, ముఖానికి మాస్క్…
Jalsa Shankar: జల్సా శంకర్ అలియాస్ చోర్ శంకర్ అలియాస్ మంచి దొంగ.. ఇన్ని పేర్లున్న ఈ శంకర్ ఎవరో తెలుసా? ఇతను ఒక పెద్ద దొంగ. ఇప్పటికి దొంగతనాల్లో సెంచరీ కొట్టాడాంటే నమ్మండి. ఇతనికి ఉన్న మంచి అలవాటు ఏంటంటే.. ఏ ఇంట్లో అయితే దొంగతనం చేస్తాడో ఆ ఇంటి నుంచి చోరీ చేసుకుని పోయిన వస్తువులు అన్నింటిని ఒక చిట్టా రాసి టేబుల్ మీద పెట్టి మరీ వెళ్ళిపోతాడు. ఏమేమి వస్తువులు తన దొంగలించాడో…
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఓ విచిత్రమైన చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఆలయంలో దొంగతనానికి పాల్పడే ముందు దొంగ ఆలయ ప్రాంగణంలో కూర్చుని దేవుడికి పూజలు చేశాడు. దీని తరువాత.. ఆలయంలోకి ప్రవేశించి హనుమంతుని విగ్రహానికి అలంకరించిన కిరీటాన్ని దొంగిలించి పారిపోయాడు. ఈ చోరీ ఘటన అంతా ఆలయంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో ఓ దొంగ చేసే చోరీలు వింతగా ఉన్నాయి. వందల సంఖ్యలో దొంగతనాలు చేసిన ఖరీదైన వస్తువుల్ని దోచుకుపోలేదు.. ఇంతకీ ఈ వింత దొంగ చేసిన చోరీలు వింటే మీకే ఆశ్చర్యం కలగక తప్పదు.. ఎందుకంటే అతను చేసిన చోరీలు ఏమిటంటే మహిళలు ఆరవేసిన జాకెట్లు ఎత్తుకుపోవడం.. నరసాపురం మండలంలో గత ఆరు నెలల నుంచి రాత్రి సమయాల్లో మహిళల జాకెట్లు కనిపించకుండా పోతున్నాయి. బాత్‌రూమ్‌లో.. బయట ఆరేసిన జాకెట్లను ఎత్తుకెళ్లిపోతుండటంతో గ్రామస్తులు…
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గుర్రపుశాల గ్రామంలో విచిత్ర దొంగతనాన్ని బయట పెట్టారు పోలీసులు.. పిల్లను ఇచ్చి పెళ్లి చేసిన ఊరికే కన్నం వేశాడు ఓ అల్లుడు.. దొంగగా మారి.. వరుసగా దొంగతనాలకు పాల్పడ్డాడు.. చూడటానికి విచిత్రంగా ఉన్న అల్లుడే దొంగగా మారి 12 ఇళ్లల్లో దొంగతనం చేసి పోలీసులకు దొరికి.. చివరకు కటకటాల లెక్క పెడుతున్నాడు ముండ్ల రాయమ్య అనే దొంగ అల్లుడు..