Robbery: మహారాష్ట్రలోని పూణెలో కేబుల్స్ దొంగిలించడానికి విద్యుత్ టవర్ ఎక్కిన యువకుడు పడిపోవడంతో మరణించాడు. ఆ తర్వాత అతని స్నేహితులు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పాతిపెట్టారు. విషయం తెలియగానే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరణించిన యువకుడి పేరు బసవరాజ్ మంగ్రుల్ (22). అతను పూణెలోని సింగఢ్ రోడ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతని కుటుంబ సభ్యులు మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో విచారణలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Minister Seethakka: కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం హేయం.. వైద్యులకు మంత్రి సంఘీభావం
బసవరాజ్ మంగ్రుల్ తన స్నేహితులు సౌరభ్ రేనూస్, రూపేష్ యెన్‌పురేతో కలిసి జూలై 13న వెల్హే తహసీల్‌లోని రంజనే గ్రామ సమీపంలో మూసి ఉన్న హైటెన్షన్ పవర్ టవర్ నుండి మెటల్ కేబుల్స్ దొంగిలించడానికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కేబుల్ ను దొంగిలిస్తూ 100 అడుగుల ఎత్తైన టవర్ పై నుంచి కిందపడి మంగ్రుల్ మృతి చెందినట్లు సింహగర్ రోడ్ పోలీస్ స్టేషన్ పోలీసు అధికారి తెలిపారు. దింతో నిందితులు సౌరభ్, రూపేష్ అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. అలాచేయకుండా పాబే అడవిలో శవాన్ని పాతిపెట్టారు.
DoubleISMART; డబుల్ ఇస్మార్ట్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏంటంటే..?
మంగ్రుల్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసు అధికారి తెలిపారు. జూలై 11 నుంచి మంగ్రుల్ కనిపించకుండా పోయాడని కుటుంబీకులు తెలిపారు. చివరిసారిగా తన స్నేహితుడు సౌరభ్ తో కలిసి పాబే గ్రామానికి వెళ్లానని చెప్పాడు. అనుమానం వచ్చిన పోలీసులు సౌరభ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. మంగ్రుల్ ను పాతిపెట్టిన స్థలాన్ని కూడా పోలీసులకు చూపించాడు.