గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాద ముఠాలకు మధ్య ఉన్న సంబంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మంగళవారం ఎన్ఐఏ అధికారులు దాడులు జరిపారు. జాతీయ దర్యాప్తు సంస్థ మంగళవారం దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
దేశంపై యుద్ధం చేసినందుకు ఉరిశిక్ష పడిన ఇద్దరు పాకిస్తానీ పౌరులతో సహా నలుగురు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులను కలకత్తా హైకోర్టు సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైన్యం చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసి ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు.
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంత్‌నాగ్‌లోని తంగ్‌పావా ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు తెలిపారు.
4Terraorists killed: జమ్ముకశ్మీర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ చంద్ర షా పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన కొనసాగుతుండగానే మరో వైపు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతుంది.
భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల వేళ.. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు భారీ కుట్రకు పన్నాగం పన్నారు. ఈ కుట్రను పసిగట్టిన పోలీసులు, భద్రతా బలగాలు దానిని భగ్నం చేశారు. పుల్వామాలోని తహబ్ క్రాసింగ్ వద్ద రోడ్డుపై ఉగ్రవాదులు అమర్చిన 25 నుంచి 30 కిలోల ఐఈడీని భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి.
దేశంలో ఉగ్ర కదలికలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక నిఘా పెట్టింది. ఆదివారం 8 రాష్టాల్లో భారత్‌లో ఐసిస్ ఉగ్రసంస్థ కార్యకలాపాలపై నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా దాడులు చేసింది. 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
ఇస్లామిక్ మిలిటెంట్ వ్యతిరేక ముఠా నైజీరియా రాజధాని అబూజలో ఉన్న ఓ కారాగారంపై దాడులకు తెగబడ్డారు. దీంతో.. దాదాపు 600 మంది ఖైదీలు పరారయ్యారు. అయితే, వీరిలో సుమారు 300 మందిని తిరిగి పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. మంగళవారం అర్థరాత్రి 10గంటల సమయంలో పక్కా ప్రణాళికతో వచ్చిన తీవ్రవాద ముఠాలు కుజీ కారాగారంపై భారీ పేలుడు పదార్థాలతో దాడికి తెగబడ్డారు. అక్కడ వున్న భద్రతా సిబ్బందిని హతమార్చిన దుండగులు, వారితో పాటు తీసుకు వచ్చిన పేలుడు…
జమ్ము & కశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్స్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారా, కుల్గాం జిల్లాల్లో ఈ ఎన్‌కౌంటర్స్‌ని నిర్వహించారు. మరణించిన ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్తాన్‌కు చెందినవాడని, లష్కరే తోయిబా సంస్థ కోసం పని చేస్తున్నాడని తెలిసింది. కొంతకాలం క్రితం అరెస్ట్ చేసిన షౌకత్ అహ్మద్ షేక్ అనే ఉగ్రవాది ఇచ్చిన సమాచారం ఆధారంగా.. సైన్యంతో కలిపి పోలీసులు కుప్వారా జిల్లా లోలబ్ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదుల శిబిరాల్ని గుర్తించి, చుట్టుముట్టారు. ఇది…