Encounter: జమ్ము కశ్మీర్ లో ఎన్ కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు ఖతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Encounter: జమ్ముకశ్మీర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ చంద్ర షా పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన కొనసాగుతుండగానే మరో వైపు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతుంది. బుధవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకడ్ని.. దక్షిణ కశ్మీర్షోపియాన్ జిల్లాలోని మోలూ ప్రాంతంలో భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. జైషే మహ్మద్ ముష్కర మూకకు చెందిన మరో ముగ్గుర్ని డ్రాచ్ ప్రాంతంలో హతమార్చారు. దీంతో భారత సైనికులు ఉగ్రవాదంపై పోరులో భద్రతా సిబ్బంది కీలక పురోగతి సాధించారు.
Read Also: Rohit Sharma: అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మ చెత్త రికార్డు
Also Read
పోలీసు హత్యకు ప్రతీకారం..
షోపియాన్లోని డ్రాచ్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు స్థానిక ఉగ్రవాదులు మరణించారు. వీరిలో ఇద్దరిని హనన్ బిన్ యాకూబ్, జంషెద్గా గుర్తించారు. పుల్వామాలోని పింగ్లానా ప్రాంతంలో అక్టోబర్ 2న జమ్ముకశ్మీర్పోలీసు జావెద్ దర్ను, సెప్టెంబర్ 24న పుల్వామాలో బంగాల్నుంచి వలస వచ్చిన కూలీని కాల్చి చంపిన కేసుల్లో యాకూబ్, జంషెద్ నిందితులని పోలీసులు తెలిపారు. మరోవైపు.. మోలూలో ఉగ్రవాదులు ఉన్నారనే కచ్చితమైన సమాచారంతో బుధవారం ఉదయం జమ్ముకశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా దళాలకు చెందిన సిబ్బంది కలిసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఓ చోట దాక్కుని ఉన్న ఉగ్రవాది కాల్పులకు తెగబడగా.. భద్రతా సిబ్బంది ప్రతిఘటించారు. ఎదురుకాల్పుల్లో ఒక ముష్కరుడు హతమయ్యాడు. మూలూరులో ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతూనే ఉందని అధికారుల్లో ఒకరు తెలిపారు.
Read Also: Bangladesh: పవర్ గ్రిడ్ ఫెయిల్.. అంధకారంలో బంగ్లాదేశ్
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!