ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రోడ్‌షో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఓ వైపు మణిపూర్‌లో హింస చెలరేగి తగలబడుతుంటే.. జమ్మూకశ్మీర్‌లో సైనికులు చనిపోతుంటే ప్రధాని కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, రోడ్ షోలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.
పూంచ్‌లో ఆర్మీ వాహనంపై దాడి ఘటనలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో లష్కరే తోయిబాకు చెందిన 6 మంది వ్యక్తుల ప్రమేయం ఉందని, అందులో ఒకరి కుటుంబం మొత్తం కుట్రలో భాగమేనని పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) దిల్‌బాగ్ సింగ్ తెలిపారు.
Court Issues Warrant Against 23 Terrorists: జమ్మూ కాశ్మీర్ కిష్ట్వార్ నుంచి బహిష్కరణకు గురైన 23 మంది ఉగ్రవాదులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే), పాకిస్తాన్ దేశాల్లో తలదాచుకుంటున్న ఉగ్రవాదులపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడం ఇది రెండోసారి. గతంలో 13 మంది ఉగ్రవాదులపై వారెంట్లు జారీ అయ్యాయి. కిష్త్వార్‌కు చెందిన 36 మంది వ్యక్తులు కొంతకాలంగా ఉగ్రవాదంలో చేరి పాకిస్తాన్‌కు వెళ్లారు. ఆ…
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లో ఆర్మీ ట్రక్కుపై మెరుపుదాడి చేసిన ఉగ్రవాదులు సాయుధ కవచాన్ని చీల్చగల ఉక్కు బుల్లెట్లను ఉపయోగించినట్లు తెలిసింది. గురువారం మధ్యాహ్నం భటా ధురియన్ దట్టమైన అటవీ ప్రాంతంలో సమీపంలోని గ్రామానికి ఇఫ్తార్ కోసం తినుబండారాలు తీసుకెళ్తున్న ఒంటరి ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఐదుగురు సైనికులు మరణించగా.. ఒకరు గాయపడ్డారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఐదుగురు ఆర్మీ జవాన్లను హతమార్చిన ఉగ్రదాడి ఘటనపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో రెండు గ్రూపులకు చెందిన ఏడుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారని రక్షణ వర్గాలు తెలిపాయి.
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వివరణ ఇచ్చారు.
దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులకు అంతర్జాతీయ సరిహద్దుల గుండా పాకిస్థాన్ ఆయుధాలు పంపడాన్ని అంతర్జాతీయంగా ఖండించాలని భారత్ పిలుపునిచ్చింది. డ్రోన్‌లను ఉపయోగించి అక్రమ ఆయుధాల సరఫరాను సీమాంతరంగా సరఫరా చేయడంలో తాము తీవ్రమైన సవాలును ఎదుర్కొంటున్నామని భద్రతా మండలికి భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తెలిపారు.
Congo : ఆఫ్రికా దేశమైన కాంగోలో ఉగ్రవాదులు మరోసారి నరమేథానికి పాల్పడ్డారు. పశ్చిమ కాంగోలోని బెనీ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో దాదాపు 20 మందికి పైగా సాధారణ ప్రజలు చనిపోయారని సమాచారం.
Pakistan: పాకిస్తాన్ లో టాప్ ఇంటెలిజెన్స్ అధికారిని చంపారు ఉగ్రవాదులు. వాయువ్య పాకిస్తాన్ లో మంగళవారం ఉగ్రవాదులు, అధికారులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇంటెలిజెన్స్ అధికారి హతమవ్వగా.. ఆయన బృందంలోని ఏడుగురికి గాయాలు అయ్యాయని పాక్ ఆర్మీ వెల్లడించింది. గతేడాది నుంచి పాక్ పరిస్థితులు దిగజారడంతో వాయువ్య ప్రాంతం అయిన ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాకిస్తాన్ తాలిబాన్లు రెచ్చిపోతున్నారు. ఈ ప్రాంతాన్ని పాక్ నుంచి విముక్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.