Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైన్యం చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసి ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల్లో ఒకరి మృతదేహాన్ని సైనికులు స్వాధీనం చేసుకోగా, నియంత్రణ రేఖ వెంబడి పడి ఉన్న మరో ఇద్దరి మృతదేహాలను పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) గ్రామస్థులు వెనక్కి తీసుకున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో అప్రమత్తమైన సైనికులు పూంచ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి కొంతమంది వ్యక్తుల అనుమానాస్పద కదలికలను గమనించారని.. భారత్‌లోకి చొరబడడానికి ప్రయత్నించారని రక్షణ ప్రతినిధి ఒకరు చెప్పారు.
BJP MP Slaps Employee: ఉద్యోగి చెంప చెల్లుమనిపించిన బీజేపీ ఎంపీ.. వీడియో వైరల్
తమపై కాల్పులు జరిపిన చొరబాటుదారులను సైనికులు సవాల్ చేశారని తెలిపారు. అనంతరం జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. రెండు ఏఏ-47 రైఫిళ్లు, ఒక పిస్టల్‌తో పాటు ఒక ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికార ప్రతినిధి తెలిపారు. పీవోకేలోని గ్రామస్థులు మరో ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను వెనక్కి తీసుకెళ్లారని అధికారులు తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతోందని, ఆ ప్రాంతంలో అన్వేషణ జరుగుతోందని రక్షణ ప్రతినిధి తెలిపారు.