ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జోస్ బట్లర్ సెంచరీతో చెలరేగడంతో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. 2 వికెట్ల తేడాతో రాజస్థాన్ సూపరీ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో బట్లర్ (107*) అద్భుతంగా ఆడటంతో రాజస్థాన్ విజయాన్ని నమోదు చేసింది. బట్లర్ ఇన్నింగ్స్ లో 60 బంతుల్లో 107 రన్స్ చేయగా.. అందులో 6 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే..…
అయోధ్యలో సంప్రోక్షణానంతరం శ్రీ రామనవమి వేడుకలను తొలిసారిగా కొత్త ఆలయంలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే రామ నవమికి సంబంధించి ఆలయ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లను చేసింది. ఇదిలా ఉండగా.. రాంలల్లా జన్మదినోత్సవం ఈనెల 17 నుంచి జరుగనుంది. అందుకోసం ఆలయ ట్రస్ట్ అధికారులు పనుల్లో మునిగిపోయారు. ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని అందించేందుకు ఆలయ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు లక్షలకు పైగా కొత్తిమీర తరుగుతో కూడిన…
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. రాజస్థాన్ ముందు భారీ పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. కోల్‌కతా బ్యాటర్లలో సునీల్ నరైన్ సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన సునీల్.. కేవలం 56 బంతుల్లోనే 109 పరుగులు చేశాడు. అతన్ని విధ్వంసకర ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 13 ఫోర్లు ఉన్నాయి. ఆ…
మూక హత్యలను అరికట్టేందుకు ఏం చేశారని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఘాటు ప్రశ్నలు వేసింది. గోసంరక్షకులు, అల్లరిమూకల కేసులపై తీసుకున్న చర్యల గురించి ఆరు వారాల్లోగా తెలియజేయాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం మహిళా సంస్థ పిటిషన్‌ను ఆరు వారాల తర్వాత విచారించాలని నిర్ణయించింది.
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోల సంఖ్య 29కి చేరింది. ఛోట్‌బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగుండా, కరోనార్ మధ్య హపటోలా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో.. పోలీసులు, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు జరగగా.. 29 మంది నక్సలైట్లు మరణించినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ లో 25 లక్షల రివార్డు ఉన్న నక్సలైట్ కమాండర్ శంకర్…
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్వర్ణాంధ్ర సాకార యాత్ర సభ నిర్వహించారు. ఈ సభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొని ప్రసంగించారు. లెజెండ్ సినిమా 400 రోజులు ప్రదర్శించి దేశ చరిత్రలో ఎమ్మిగనూరు నిలిచిపోయిందని తెలిపారు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా మనమేనని అన్నారు. ఎన్టీఆర్ నటనకు విశ్వరూపం అని చెప్పారు. మరోవైపు.. మహిళల్లో చంద్రబాబు ఆర్థిక విప్లవాన్ని తెచ్చారని పేర్కొన్నారు. రాయలసీమకు తాగునీరు, సాగునీరు ఇచ్చిన అభినవ భగీరథుడు అని కొనియాడారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈడెన్ గార్డెన్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అందులో భాగంగా టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా.. బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ పాయింట్ల పట్టికలో మొదటి, రెండో స్థానాల మధ్య ఉన్న జట్ల మధ్య జరుగుతుండటంతో ఆసక్తికరంగా ఉండనుంది.
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి స్విఫ్ట్ నాల్గవ ఎడిషన్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్‌లో అనేక కొత్త అప్డేట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఆటో మోటార్ షోలో మారుతి పేరెంట్ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ తన ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ కారును ప్రదర్శించింది. అయితే.. ఇండియా-స్పెక్ మోడల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. యెడ్ (YED) కోడ్ నేమ్‌తో…
రాష్ట్రంలో ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచార సభల్లో బీజేపీ అగ్రనాయకులు, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్, అమిత్ షా, జేపీ నడ్డాలు రాష్ట్రానికి రానున్నట్లు బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రాజు వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో అగ్రనాయకులు పాల్లొంటారని తెలిపారు. ఈ ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని.. యువత ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకి వెళ్లిపోతున్నారన్నారు.
అమరావతి: న్యాయం జరగడంలో ఆలస్యమవ్వొచ్చేమో గానీ న్యాయం మాత్రం గెలుస్తుందని మాజీ మంత్రి కేఎస్ జవహార్ అన్నారు. 1996లో జరిగిన శిరోముండనం కేసులో మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులుకు 18 నెలలు జైలు శిక్ష పడటంపై ఆయన స్పందించారు. తోట త్రిమూర్తులను వైసీపీ నుంచి వెంటనే బహిష్కరించాలన్నారు. లేదంటే దళితుల అణచివేతకు జగన్ లైసెన్స్ ఇచ్చినట్లే అని విమర్శించారు.