నేడు నామినేషన్ దాఖలు చేయనున్న మంత్రులు
ఏపీలో ఎన్నికల్లో జోరు పేరిగింది. నిన్న ఎన్నికల నోటిషికేషన్ విడుదల కావడంలో పశ్చిమగోదావరి జిల్లాలో నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు మంత్రులు. గోపాలపురంలో హోంమంత్రి తానేటి వనిత నామినేషన్‌కు సిద్ధం కాగా… తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వర రావు నామినేషన్ వేయనున్నారు. భీమవరంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అని, దెందులూరులో ఎమ్మెల్యే అబ్బాయచౌదరి నామినేషన్లు అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే.. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయనున్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టి.. చీపురుపల్లి మూడు రోడ్ల కూడలి వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు.
మళ్లీ కాంగ్రెస్ కు తలనొప్పిగా మారిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ
లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తలనొప్పిగా మారారు. గురువారం పాటియాలాలోని నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇంట్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అతని గ్రూపు నాయకులు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేయకూడదని లేదా ఏ కార్యక్రమంలోనూ కాంగ్రెస్ అభ్యర్థితో కలిసి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూతో పాటు, పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు షంషేర్ సింగ్ డుల్లో, మాజీ ఎమ్మెల్యే నాజర్ సింగ్ మన్షాహియా, జగదేవ్ సింగ్ కమలు, మహేశ్ ఇందర్ సింగ్, భటిండా రూరల్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ హర్బిందర్ లాడి సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
భట్టి విక్రమార్క మాట మార్చారు.. కేటీఆర్ ట్వీట్ వైరల్
ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రూ. 4,000 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చాక.. అసలు అటువంటి హామీ ఏమివ్వలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట మార్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ 120 రోజుల పాలనలోనే నిరుద్యోగులతో పాటు అందరినీ మోసం చేయడం ప్రారంభించిందని విమర్శించారు.
ఎన్నికల్లో మద్య ప్రభావం తగ్గించేలా అనేక చర్యలు చేపట్టాం
ఎన్నికల్లో మద్య ప్రభావం తగ్గించేలా అనేక చర్యలు చేపట్టామన్నారు ఏపీ సీఈఓ ఎంకే మీనా. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిస్టలరీలు, బ్రూవరీస్ నుంచి వెబ్ క్యాస్టింగ్ ద్వారా నిఘా పెట్టామని, మద్యం రవాణ జరిపే వాహానాలకు జీపీఎస్ ట్రాకింగ్ పెట్టామన్నారు ఎంకే మీనా. సేల్ పాయింట్ల వద్ద గతంలో జరిగిన అమ్మకాలకు.. ఇప్పుడు జరుగుతున్న అమ్మకాలను బేరీజు వేస్తున్నామని, 7 లక్షల మంది హోం ఓటింగుకు అర్హులైన వాళ్లున్నారన్నారు. సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ మీద వచ్చిన ఆరోపణలపై వివరణ తీసుకుని సీఈసీకి పంపామని ఆయన వ్యాఖ్యానించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలను కట్టడి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అన్ని పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. అందరికీ నోటీసులు పంపాం.. వాళ్లు రిప్లై ఇచ్చారని, రాజీనామై చేసిన వలంటీర్లను ఎన్నికల ఏజెంట్లుగా అనుమతించాలా..? వద్దా..? అనే అంశంపై సీఈసీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామన్నారు ఎంకే మీనా. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వీఐపీల పర్యటనల్లో భద్రతా వైఫల్యాలు లేకుండా చూసేలా మరిన్ని కొత్త సూచనలు చేశామని ఆయన వ్యాఖ్యానించారు.
వైసీపీ ఎంపీటీసీ దారుణ హత్య..
అల్లూరి జిల్లాలో వైసీపీ ఎంపీటీసీ దారుణ హత్యకు గురయ్యారు. ఎటపాక మండలం కన్నాయిగూడెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ వర్షా బాలకృష్ణ (40) దారుణంగా హత్య చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు బాలకృష్ణ తలపై బండరాయితో మోదటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో కొందరు వ్యక్తులతో జరిగిన గొడవలో వారు బండరాయితో కొట్టి చంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కన్నాయిగూడెం గ్రామశివార్లలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు ఎటపాక పోలీసులు. పోలీసులు ఇద్దరి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంపీటీసీకి ఆ ఇద్దరి వ్యక్తులకు అసలు గతంలో ఉన్న వివాదం ఏంటి అనే దానిపై పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సీఎం జగన్ సమక్షంలో జనసేన నుంచి వైసీపీలోకి
జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాకినాడ మాజీ మేయర్ సరోజతోపాటు పలువురు నేతలు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ సరోజ మాట్లాడుతూ. జనసేన పార్టీలో మహిళలకు బీసీలకు గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు నచ్చక రాజీనామా చేసి వైసీపీలో చేరామని చెప్పారు. జగన్ నాశనం కావాలని కోరుకుంటున్న పవన్, చంద్రబాబు నాశనం అయిపోతారని ఆరోపించారు. జిల్లాలో కూటమి అభ్యర్థులను ఓడించి తీరుతామని శపథం చేశారు.
ఇదిలా ఉంటే.. విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీలోకి నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు మనుకాంత్‌రెడ్డి, జనసేన నేతలు కాటంరెడ్డి జగదీష్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్ యాదవ్, టీడీపీ నేత చేజర్ల సుబ్బారావు, కాంగ్రెస్ నేతలు పంతం నెహ్రూ, ఇందిర వైసీపీలో చేరారు. అంతకుముందు.. తూర్పుగోదావరిలో సీఎం జగన్ రోడ్ షో అత్యద్భుతంగా జరిగింది. స్వచ్ఛందంగా వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. ఎండను సైతం లెక్కచేయకుండా మహిళలు సీఎం రాక కోసం ఎదురు చూశారు. సీఎం జగన్ పై తమకున్న ప్రేమాభిమానాలను జనం చూపించారు. సీఎంకు ఉన్న జనాభిమానాన్ని చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి. వారి మీడియాలో అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఎవరేనుకున్నా వైఎస్ జగన్‌కు అత్యధిక ప్రజాదరణ రోడ్ షోలో మరోసారి స్పష్టమైంది.
ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడిన మోడీ
అమ్రోహా లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కన్వర్ సింగ్ తన్వర్‌కు మద్దతుగా గజ్రౌలాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్పీ-కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఇద్దరు యువరాజుల జంట సంచరిస్తోందని, తమ సినిమా షూటింగ్ జరుగుతోందని ప్రధాని మోడీ అన్నారు. ఈరోజు తొలి విడత పోలింగ్ జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద వేడుకకు ఇది పెద్ద రోజు. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును ఓటర్లందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా మొదటిసారి ఓటు వేయబోతున్న మన యువత ఈ అవకాశాన్ని వదులుకోవద్దని, తప్పకుండా ఓటు వేయాలని కోరారు.
బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి ప్రకాశ్ గౌడ్
బీఆర్ఎస్ పార్టీ మరో ఎమ్మెల్యేను కోల్పోనుందా..? అంటే అవును అనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 39 స్థానాలు మాత్రమే గెలుచుకుని బీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండుసార్లు భారీ విజయం సాధించిన బీఆర్ఎస్.. మూడోసారి కూడా గెలుపొందాలని ఆ పార్టీ నేతలంతా కలలు కన్నారు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చారు. ఈ షాక్ నుంచి తేరుకోకముందే కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తేసింది. బీఆర్ఎస్ నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలుపడంతో ఇంకా ఆగుతారా? పదేళ్లుగా బీఆర్ ఎస్ పార్టీలో కీలక పదవుల్లో కొనసాగిన సన్నిహితుల నుంచి కింది స్థాయి నేతల వరకు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా దాన నాగేందర్, కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే వెంకటరావు కాంగ్రెస్ లో చేరగా.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు ఆయనే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.
కిషన్ రెడ్డికి మనుషులు మాత్రమే తెలుసు.. మతం, కులం రంగు లేదు..
కిషన్ రెడ్డికి మతం, కులం, రంగు లేదు.. ఆయనకు మనుషులు మాత్రమే తెలుసని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎంపీ లక్షణ్, ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కిషన్ రెడ్డికి మనుషులు మాత్రమే తెలుసు.. మతం, కులం రంగు లేదని అన్నారు. 2004 నుంచి 2014 వరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోకుండా నేను కిషన్ రెడ్డి ఇద్దరం గెలిచామన్నారు. 2019లో ఆయన తప్పిపోయాడు.. నేను మొన్న తప్పిపోయా అన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయలను భుజం మీద పెట్టుకుని నడిపిస్తున్నాడు కిషన్ రెడ్డి అని తెలిపారు.
హరీష్ రావు గట్టు మీద నిల్చున్నాడు.. కాంగ్రెస్ లోకా లేక..?
హరీష్ రావు గెట్టు మీద నిల్చున్నాడు కాంగ్రెస్ లోకి పోతాడా అందులోనే ఉంటాడా తెల్వదని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘు నందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రఘు నందన్ రావు మాట్లాడుతూ.. రఘునందన్ రావు దుబ్బకలో ఓడిపోవడం ఎంత నిజమో.. కామారెడ్డిలో కేసీఆర్ ని బీజేపీ వాళ్లు ఓడించింది అంతే నిజం అన్నారు. తెలంగాణలో ఆడపిల్లలు లిక్కర్ దందా నడపరు… మరికొద్ది రోజుల్లో కేసీఆర్ ఇంట్లో వాళ్ళు జైల్ కి వెళ్ళక తప్పదని అన్నారు. రేవంత్ రెడ్డి లంకె బిందెలు ఉన్నాయని అధికారంలోకి వచ్చాడా? లేదా ఖాళీ బిందెలు ఉన్నాయని అధికారంలోకి వచ్చాడా? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు గట్టు మీద నిల్చున్నాడు.. కాంగ్రెస్ లోకి పోతాడా అందులోనే ఉంటాడా తెల్వదని సంచలన వ్యాఖ్యలు చేశారు.