శరీరంలో ఉత్పత్తి అయ్యే యూరిక్ యాసిడ్, ప్యూరిన్ అనే పదార్ధం విచ్ఛిన్నం ద్వారా ఏర్పడిన రసాయనం. ఇది ఆరోగ్యానికి చాలా అవసరం మరియు హానికరం. ఇది మీ శరీరంలో ఎంత ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, అధిక స్థాయి యూరిక్ యాసిడ్ మూత్రపిండాల్లో రాళ్లు మరియు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్ని అధ్యయనాలలో, ఇది అధిక రక్తపోటు, గుండె వైఫల్యం మరియు మెటబాలిక్ సిండ్రోమ్‌తో ముడిపడి ఉంది. ఇవి ఒక వ్యక్తికి…
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో సుమారు 1200 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వారు నిర్వహిస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా వాలంటీర్లను విధుల నుండి తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వాలంటీర్లంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెయ్యాలంటే వారు స్వయంగా రంగం లోకి దిగాల్సిందేనని తీర్మానించుకుని ఈ రాజీనామా అస్త్రాలు సంధిస్తున్నారు. రాజీనామాలు అనంతరం వీరంతా పార్టీ కార్యకర్తల్లా మారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 38 మందికి గాయాలు ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో బస్సు ఫ్లై ఓవర్‌పై నుంచి పడిపోవడంతో ఐదుగురు మృతి చెందగా, 38 మంది గాయపడ్డారు. గాయపడిన వారి సంఖ్యను జాజ్‌పూర్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ధృవీకరించారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. క్షతగాత్రులను కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ, జాజ్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు పంపినట్లు ఆయన తెలిపారు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా బారాబతి సమీపంలో…
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి సింబల్ విషయంలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనేది ఉత్కంఠగా మారింది.. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాము దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల కమిషన్ (ఈసీ) నిబంధనలకు విరుద్ధంగా ఈ గుర్తును జనసేన పార్టీకి ఇచ్చిందని పిటిషన్లో పేర్కొంది. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు, తీర్పు రిజర్వ్ చేసింది. నేడు జనసేన…
నేడు తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా పవన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తమిళనాడులో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండటంతో పవన్ కల్యాణ్ ను అక్కడ పర్యటించాలని కోరడంతో ఈరోజు ఆయన అక్కడ పర్యటిస్తున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో భాగంగా టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ కూటమి అయిన ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యారు. కాగా ఎన్నికల్లో తమిళనాడులో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా చేసుకున్న బీజేపీ అందొచ్చిన…
నేడు సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్. ఉదయం 9 గంటలకు నారాయణపురం నుంచి ప్రారంభం. గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కాలేజ్ దగ్గర సభ. మధ్యాహ్నం 3.30 కి సీఎం జగన్ బహిరంగ సభ. పిప్పర, పెరవలి, సిద్దాంతం క్రాస్ మీదుగా ఈతకోటకు చేరుకోనున్న సీఎం జగన్. నేడు బీహార్‌లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం. గయా గాంధీ మైదాన్‌లో ప్రధాని మోడీ బహిరంగ సభ. పూర్నియాలో ప్రధాని మోడీ ర్యాలీ, బహిరంగ సభ. నేడు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు బిగ్ ఫైట్ జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో చాలా రికార్డులు నమోదయ్యాయి. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. మ్యాచ్ కు హైలెట్ అంటే దినేష్ కార్తీక్ అని చెప్పాలి. దాదాపు మ్యాచ్ గెలిచినంత దగ్గరగా తీసుకొచ్చాడు. డీకే ఔట్ కాకుండా ఉంటే.. ఆర్సీబీ…
సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 19 రోజుల తర్వాత తన సొంత రికార్డును తానే బద్దలు కొట్టింది. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద స్కోరును సాధించింది. కాగా.. దానిని SRH స్వయంగా బ్రేక్ చేసింది. ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించింది. ఆర్సీబీ బౌలింగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్లు విధ్వంసంగా ఆడారు. ఓపెనింగ్ జోడీ ట్రావిస్ హెడ్, అభిషేక్…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లపై సన్ రైజర్స్ బ్యాటర్లు ఊచకోత చూపించారు. బెంగళూరు ముందు 288 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచారు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. ఆకాశమే హద్దుగా సన్ రైజర్స్ బ్యాటర్లు చెలరేగారు. చినస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించారు. వరుస సిక్సర్లతో సన్ రైజర్స్ బ్యాటర్స్ విరుచుకుపడ్డారు. సన్ రైజర్స్ బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్ సెంచరీతో రాణించాడు.…
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పంటల భీమా -2024 అమలుకు సంబంధించి అధికారులు పంపిన ప్రతిపాదనలను పరిశీలించి, ఎన్నికల సంఘం అనుమతితో.. ఈ ఖరీఫ్ కాలానికి పంటల భీమా పథకం అమలు చేసే విధంగా టెండర్ల ప్రక్రియ చేపట్టవల్సిందిగా ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఏ ఒక్కరైతు, ఏ ఒక్క ఎకరానికి ప్రకృతి విపత్తుల వలన పంట నష్టపోయో సందర్భం ఇక ఉండకుండా.. ఈ పంటల భీమా పథకాన్ని అమలు చేస్తామని తెలియచేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో…