Prakash Goud: బీఆర్ఎస్ పార్టీ మరో ఎమ్మెల్యేను కోల్పోనుందా..? అంటే అవును అనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 39 స్థానాలు మాత్రమే గెలుచుకుని బీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండుసార్లు భారీ విజయం సాధించిన బీఆర్ఎస్.. మూడోసారి కూడా గెలుపొందాలని ఆ పార్టీ నేతలంతా కలలు కన్నారు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చారు. ఈ షాక్ నుంచి తేరుకోకముందే కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తేసింది. బీఆర్ఎస్ నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలుపడంతో ఇంకా ఆగుతారా? పదేళ్లుగా బీఆర్ ఎస్ పార్టీలో కీలక పదవుల్లో కొనసాగిన సన్నిహితుల నుంచి కింది స్థాయి నేతల వరకు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా దాన నాగేందర్, కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే వెంకటరావు కాంగ్రెస్ లో చేరగా.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు ఆయనే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.
Read also: Manchu Lakshmi : కారులో ఆ పోజులేంటి లక్ష్మక్క.. కిల్లింగ్ లుక్ లో లేటెస్ట్ స్టిల్స్ ..
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిశారు. ఈ సమావేశంలో తాను పార్టీలో చేరేందుకు సిద్ధమని రేవంత్‌కి చెప్పినట్లు తెలిసింది. మరో రెండు, మూడు రోజుల్లో ఆయన అధికారికంగా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. ఇదిలావుంటే, గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 65 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకే పరిమితమైంది. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిన్న కేసీఆర్ తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి షాక్ ఇచ్చారు. మరి ఇది నిజమో కాదో తెలియాల్సి ఉంది.
T20 World Cup 2024: ఆ ఆటేంది.. కొంచెం యశస్వి జైస్వాల్‌తో మాట్లాడండి!