జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాకినాడ మాజీ మేయర్ సరోజతోపాటు పలువురు నేతలు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ సరోజ మాట్లాడుతూ. జనసేన పార్టీలో మహిళలకు బీసీలకు గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు నచ్చక రాజీనామా చేసి వైసీపీలో చేరామని చెప్పారు. జగన్ నాశనం కావాలని కోరుకుంటున్న పవన్, చంద్రబాబు నాశనం అయిపోతారని ఆరోపించారు. జిల్లాలో కూటమి అభ్యర్థులను ఓడించి తీరుతామని శపథం చేశారు.
ఇదిలా ఉంటే.. విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీలోకి నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు మనుకాంత్‌రెడ్డి, జనసేన నేతలు కాటంరెడ్డి జగదీష్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్ యాదవ్, టీడీపీ నేత చేజర్ల సుబ్బారావు, కాంగ్రెస్ నేతలు పంతం నెహ్రూ, ఇందిర వైసీపీలో చేరారు. అంతకుముందు.. తూర్పుగోదావరిలో సీఎం జగన్ రోడ్ షో అత్యద్భుతంగా జరిగింది. స్వచ్ఛందంగా వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. ఎండను సైతం లెక్కచేయకుండా మహిళలు సీఎం రాక కోసం ఎదురు చూశారు. సీఎం జగన్ పై తమకున్న ప్రేమాభిమానాలను జనం చూపించారు. సీఎంకు ఉన్న జనాభిమానాన్ని చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి. వారి మీడియాలో అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఎవరేనుకున్నా వైఎస్ జగన్‌కు అత్యధిక ప్రజాదరణ రోడ్ షోలో మరోసారి స్పష్టమైంది.