ఐపీఎల్ 2024లో బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. బౌలర్ల కంటే బ్యాటర్ల డామినేషన్ ఎక్కువైంది. ఈ సీజన్ లో పలు జట్లు భారీ స్కోరులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.. నిన్న కేకేఆర్-రాజస్థాన్ మధ్య కూడా భారీ స్కోరు నమోదైంది. ఇరు జట్లు 200కు పైగా పరుగులు చేశాయి. ఈ సీజన్ లో మొదటగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 549 పరుగులు నమోదయ్యాయి. అందులో 38 సిక్సర్లతో సహా 81 బౌండరీలు బాదారు.…
రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులోని ఎం.కన్వెన్షన్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన నియోజకవర్గ స్థాయి యాదవుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీ-ఫారాలు అందించారు. 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 2 పార్లమెంట్ స్థానాలకు పవన్ బీ ఫారాలు అందించారు. తొలి బీ-ఫారం నాదెండ్ల మనోహర్‌కు ఇచ్చారు. రేపట్నుంచి నామినేషన్లు ఉండడంతో ఇవాళే బీ-ఫారాలు అందించారు జనసేనాని పవన్‌కళ్యాణ్.
అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని గుంటూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాజధాని అమరావతిలో కట్టడాలను పలువురు నేతలతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు.
ఉదయగిరి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో చాలా మంది వైసీపీకి చెందిన కుటుంబాలు టీడీపీలో చేరుతున్నాయి.
రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పేర్కొన్నారు. 18 నుంచి 25 లోపు నామినేషన్లు తీసుకోవడం జరుగుతుందని.. రేపు సెక్షన్ 30, 31 నోటీసు ఇస్తామన్నారు. ఫారం - 1 పబ్లిక్ నోటీసుపై రిటర్నింగ్ అధికారి సంతకం చేస్తారని.. రేపు ఉదయం 11 గంటల నుంచీ నామినేషన్లు స్వీకరించడానికి సంసిద్ధం చేసుకుంటారన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఆస్థానం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా నేడు సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు ఇవాళ బ్రేక్ పడింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం ప్రకటించారు.
రెండో అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈనెల 25 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.