పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు వరికుంటపాడు మండలం విరువూరు, కొండాయపాలెం, ధర్మవరం, తోటల చెరువుపల్లి, మహ్మదాపురం, కృష్ణంరాజు పల్లి, తొడుగుపల్లిలోని ఎస్సీ, బీసీ, ఎస్టీ కాలనీలలో ఎన్నికల ప్రచారాన్ని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్లె జనం నీరాజనాలు పలికారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపిస్తామని, ఘంటా పదంగా తెలిపారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయక విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అమృత దార ద్వారా జిల్లా వ్యాప్తంగా 150 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఫ్లోరిడ్ సమస్యను అధికమిస్తున్న ప్రజాసేవకుడు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్ అను నన్ను ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 వేల కిలో మీటర్ల సిమెంట్ రోడ్డు వేసిన ఘనత చంద్రబాబుది అన్నారు. నాలుగు లక్షల మందికి నిరుద్యోగ భృతి అందించారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో 11 లక్షల 80 వేల ఇల్లు నిర్మించిన ఘనత చంద్రబాబుది అన్నారు. రాష్ట్రంలో లక్షలాది కంపెనీలను తీసుకొచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేశారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు అంధకారం కావడంతో బ్రతుకు భారమై ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వలసలు పోవాల్సిన పరిస్థితి తయారయిందన్నారు. మే 13న జరగనున్న భీకర యుద్ధంలో పసుపుదళం వీర సైనికులై పోరాటం చేసి తెలుగుదేశాన్ని గెలిపించాలన్నారు. తిరుపతి వెంకన్న, శ్రీశైలం మల్లన్న, సింహాచలం అప్పన్న సాక్షిగా చెబుతున్నాను వచ్చేది చంద్రన్న ఉదయగిరిలో గెలిచేది తెలుగుదేశం అన్నారు. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఉదయగిరి రూపురేఖలు మారుస్తానని, మార్పు తీసుకొస్తానని పాలకుడిగా కాకుండా సేవకుడిగా పని చేస్తానని కాకర్ల సురేష్ తెలిపారు.
ప్రతి గ్రామంలో ఆ గ్రామ నాయకులు ఆధ్వర్యంలో గజమాలతో శాలువాలతో పూలమాలలతో కాకర్ల సురేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్ రావు, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ యాదవ్, తెలుగు యువత అధ్యక్షులు లక్ష్మీ నారాయణ, మాజీ సొసైటీ అధ్యక్షులు కామేపల్లి వెంకటరత్నం, జడ్పీటీసీ సభ్యులు రావెళ్ళ నాగేంద్ర, మాజీ మండల కన్వీనర్ వెంకయ్య, ఉమామహేశ్వరరావు, గ్రామ నాయకుడు పేరం సుధాకర్ రెడ్డి, పావులూరి రవీంద్రబాబు రాయుడు, పావులూరి మాలకొండయ్య, వేణుగంటి గంగయ్య, ఆండ్రా బాల గురువారెడ్డి, కాకి ప్రసాదు, గుంటుపల్లి నాగభూషణం, సర్పంచ్ వెనుగు వెంకటేశ్వర్ రెడ్డి, తెలుగుదేశం- జనసేన- బీజేపీ ముఖ్య నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.