ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచారు. మరోవైపు.. రాష్ట్రంలో అధికారుల బదిలీలు కూడా జరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు పడింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి. వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అతడిని ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు కట్టబెట్టొద్దని, తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
సార్వత్రిక ఎన్నికలను బీఆర్ఎస్ సమాయత్తమైంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులు అందజేయనున్నారు.
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు నిస్సాన్ మాగ్నైట్‌ను నాలుగు మీటర్ల SUV విభాగంలో అందించింది. ఈ SUVలో లోపం ఉన్నట్లు కంపెనీకి సమాచారం అందింది. ఆ తర్వాత కొన్ని యూనిట్లు రీకాల్ చేయబడ్డాయి. లోపం గురించి సమాచారం అందుకున్న తర్వాత, ఆ కంపెనీ తన SUVని రీకాల్ చేసింది. నిస్సాన్ మాగ్నైట్ SUVలో సెన్సార్ పనిచేయకపోవడం గురించి సమాచారం అందింది. దీంతో.. కొన్ని యూనిట్లు రీకాల్ చేశారు. అయితే ఎన్ని యూనిట్లను రీకాల్ చేశారనే దానిపై…
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఏఎస్ఐపై ముఖేష్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటన మీట్ నగర్ ఫ్లై ఓవర్ దగ్గర జరిగింది. ఈ కాల్పుల్లో ఏఎస్ఐ దినేష్ శర్మతో పాటు, బైక్ పై వెళ్తున్న అమిత్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన అనంతరం.. నిందితుడు ఓ ఆటోను బలవంతంగా ఆపి అందులో కూర్చోని తాను గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల దాడిలో ఏఎస్సై మరణించాడు. మరో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ 2023 తుది ఫలితాలు ఈరోజు విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలలో మొత్తం 1,016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. అందులో.. ఆదిత్య శ్రీవాత్సవకు తొలి ర్యాంకు వచ్చింది. శ్రీవాత్సవ లక్నోకు చెందిన నివాసి.
ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ నేతలు నియోజకవర్గాల వారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు శ్రీ సత్యసాయి జిల్లాలోని గాండ్లపెంట, కదిరి రూరల్, తనకల్లు మండలాల్లో ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మంచి చేశారు కాబట్టే తనకు ఓటు వేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుతున్నారన్నారు. చంద్రబాబు ఐదేళ్లు రాజధాని పేరుతో వృధా చేసి, లోపభూయిష్టంగా నాలుగు భవనాలు కట్టారని…
ఎల్లుండి నుంచే ఏపీ, తెలంగాణల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో మరింతగా పొలిటికల్ హీట్ పెరగనుంది. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. నాలుగో దశలో ఏపీ, తెలంగాణకు ఎన్నికలు జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరుగనుంది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ…
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్లుండి నుంచి ఆన్ లైన్ లో జూలై నెలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఎల్లుండి ఉదయం 10 గంటలకు లక్కీ డిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కేట్లను టీటీడీ విడుదల చేయనుంది. 22వ తేది ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కేట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా…
గత శనివారం సీఎం వైఎస్ జగన్‌పై రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే.. సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడి గుర్తించారు పోలీసులు. దాడి చేసింది సతీష్ కుమార్ అలియాస్ సత్తిగా పోలీసులు గుర్తించారు. ఈ రోజు ఉదయం సతీష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఫుట్‌పాత్ కోసం వేసే టైల్ రాయితో దాడి చేసినట్లు తెలుసుకున్నారు. రాయిని జేబులో వేసుకొని వచ్చి దాడిచేశాడని పోలీసులు దర్యాప్తులో తేలింది. దాడి చేసిన సమయంలో సతీష్‌తో పాటు…
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మా పలాస బహిరంగ సభ పెట్టారన్నారు మంత్రి సీదిరి అప్పల రాజు. ఇవాళ ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. బాబు.. మీ అమోగమైన పాలన ప్రత్యక్షంగా చూశారన్నారు. రాష్ర్టాన్ని పద్నాలుగెండ్లు ఎలా దోచుకున్నారో ప్రజలు చూశారని ఆయన విమర్శించారు. పెత్తందారులు రాష్ర్టాన్ని ఎలా సంకనాకించారో చుసామని, బాబు స్కిల్ డవలప్ మెంట్ స్కాంలో పైనాన్స్ సెక్రటరీ పీవీ రమేష్ అన్నారు. రూల్స్ అతిక్రమించి ఒరల్ ఇనస్ట్రక్షన్ సిఎం ఇచ్చారని రాసిందెవరని ఆయన ప్రశ్నించారు. పివి…