నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెం మునులపూడి గ్రామాలలో కోవూరు వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ధనవంతులు చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారని, ఎప్పుడూ కనబడని వ్యక్తులు ఎన్నికలు రావడంతో మన దగ్గరకు వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో గ్రామస్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు మేము మీ మధ్య తిరిగి ధైర్యం చెప్పామని, అప్పుడు తెలుగుదేశం,బిజెపి జనసేన,కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వాళ్లు ఎవరు కూడా గ్రామాల్లోకి రాలేదన్నారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. కోవూరులో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వారిని పక్కనపెట్టి ఒక కోటేశ్వరురాలిని దించారని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాజ్యసభను జగన్ ఇచ్చారని ఆయన అన్నారు. ఆరు సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడుపుతూ విదేశాలు తిరుగుతూ కాలయాపన చేశాడని, డబ్బుతో ప్రజలను కొనాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం వాళ్ళు ఓటుకు 5 వేలు ఇస్తారంట తీసుకొని..ఫ్యాను గుర్తుకు ఓటు వేయండన్నారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.