అధికార వైసీపీ పార్టీపై గుంటూరు లోక్ సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. ఉన్మాదికి అధికారం ఇస్తే ఎలాంటి విధ్వంసం జరుగుతుందనేందుకు అమరావతి ప్రత్యక్ష ఉదాహరణ అని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాజధాని ప్రాంతంలో ఆయన ఇవాళ పర్యటించి అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలను, జరిగిన విధ్వంసాన్ని పరిశీలించారు. ఉద్దండరాయినిపాలెంలో అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతం, ప్రజాప్రతినిధులు అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలు, సెక్రటేరియట్ కాంప్లెక్స్, అంబేద్కర్ స్మృతివనం ప్రాంతాలను…
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్ హైవేపై నదియాడ్ సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను ఓ కారు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఢిల్లీలో సంచలనం సృష్టించిన జంట హత్య కేసు వెలుగులోకి వచ్చింది. తూర్పు ఢిల్లీలోని షకర్పూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్య, బావమరిదిని దారుణంగా హత్య చేశాడు. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉండగా.. పోలీసులు అతని కోసం జల్లెడపట్టి అరెస్ట్ చేశారు. కాగా.. హత్య ఘటనపై పోలీసులు విచారించగా.. వారిని హత్య చేయడానికి స్క్రూడ్రైవర్ను ఉపయోగించినట్లు నిందితుడు తెలిపాడు. దీంతో.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన ట్విట్టర్ వేదికగా .. ‘తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3 వ ర్యాంక్ సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పిన పాలమూరు బిడ్డ అనన్య రెడ్డి కి ప్రత్యేక అభినందనలు. వరుసగా రెండోసారి తెలంగాణ బిడ్డకు జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ రావటం చాలా సంతోషానిస్తోంది. వందలోపు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. మంగళవారం కోల్కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్.. 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ చరిత్రలో ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన స్పిన్ బౌలర్గా చాహల్ నిలిచాడు. 2015లో ఆర్సీబీ తరుఫున ఆడుతున్నప్పుడు ఎక్కువ పరుగులు ఇచ్చాడు. తాజాగా.. తన పాత రికార్డును…
శ్రీ రామ నవమి సందర్భంగా ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వివిధ దేవాలయాల్లో నిర్వహించిన శ్రీ సీతా రాములు కళ్యాణ వేడుకల్లో బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా శ్రీ రామ నవమి వేడుకలు జరుగుతున్నాయని, ముఖ్యంగా అయోధ్య రామ మందిర నిర్మాణం తరువాత మొదటి శ్రీ రామ నవమి కావడం విశేషమన్నారు. ప్రతి గ్రామంలో అందరూ శ్రీ రాముని కళ్యాణం ఎంతో…
న్యూయార్క్లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బ్రోంక్స్లో చోటు చేసుకుంది. దుండగులు స్కూటర్లపై వెళుతూ కాల్పులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక సిగ్నల్ వద్ద రెండు స్కూటర్లపై వచ్చిన దుండగులు దాదాపు 10 షాట్లు కాల్చినట్లు అసిస్టెంట్ పోలీస్ చీఫ్ బెంజమిన్ గుర్లే వెల్లడించారు.
హాస్టల్ భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ముఖర్జీ నగర్లోని ఓ పీజీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని ఈరోజు తెల్లవారుజామున సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని చేరుకుని పరిశీలించారు. తెల్లవారుజామున 3.20 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతురాలు 29 ఏళ్ల స్వాతిగా గుర్తించారు. రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం…
తెలంగాణలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం అయిన ఎములాడ (వేములవాడ) రాజన్న సన్నిధిలో శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీ సీతరాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.శ్రీ రాములోరి కళ్యాణ ఘట్టం తిలికించడానికి తెలంగాణ జిల్లాలతో పాటు అంధ్రప్రదేశ్, మహరాష్ర్ట, తదితర ప్రాంతాల నుండి సుమారు లక్ష మంది భక్తులు, శివ పార్వతులు, జోగినిలు, హిజ్రలు హజరయ్యారు.. ఉదయమే శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతరామచంద్రమూర్తికి పంచోపనిషత్తు ద్వార అభిషేకాలు నిర్వహించారు.…
సోషల్ మీడియా వేదిక రేగా కాంతారావు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉండాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, ప్రజలకు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చక పోతే వదిలిపెట్టమన్నారు రేగా కాంతా రావు. కానీ రేవంత్ ప్రభుత్వానికి ఎంపీ ఎన్నికల్లో ప్రజా తిరుగుబాటు తప్పదని, ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఏ పరిస్థితులు సంభవిస్తాయో అని ప్రజల్లో చర్చ ఉందన్నారు. ఖమ్మం, నల్గొండ మానవ బాంబులతో ప్రమాదం ఉంది ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు రేగా కాంతా…