అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు. పట్టణంలోని పీ అండ్ టీ కాలనీలో తండ్రిని కన్నకూతురే కడతేర్చింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సోమన్నపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కాలకృత్యాలకు వెళ్లిన అక్కాచెల్లెళ్లు ఇద్దరు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ జేఈవో గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఇవాళ సాయంత్రం సచివాలయానికి రానున్నారు. ఇవాళ సాయంత్రం 4.41 గంటలకు చాంబర్లో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నేడు సచివాలయం మొదటి బ్లాక్ చాంబర్లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు.
వేసవి సెలవుల అనంతరం ఏపీలో నేడు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇక విద్యార్థులు, ఉపాధ్యాయులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. ప్రతి ఏటా జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. కానీ ఈ ఏడాది నూతన ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో అదనంగా ఓ రోజు సెలవు వచ్చింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు ఉన్నా చాలా మంది ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. బుధవారం రాయికోడ్‌లో జరిగిన “బడి బాట” ఆవిష్కరణ కార్యక్రమంలో దామోదర రాజనరసింహ మాట్లాడుతూ గ్రామాల నుంచి పాఠశాల బస్సుల్లో ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లాలని చాలా మంది కలలు కంటున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. అయితే, ఇది చిన్న నిజం.…
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని టీజీఎస్ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది. సాధారణ చార్జీలు యథాతథంగానే ఉన్నాయి. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్ లోని టోల్ సెస్ ను సంస్థ సవరించడం జరిగిందని తెలిపింది. ఈ సవరించిన టోల్ సెస్ ఈ నెల 3వ తేదీ నుంచే అమల్లోకి…
అత్యంత నిరాడంబరంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు బండి సంజయ్ కుమార్. రేపు ఉదయం 10.35 గంటలకు నార్త్ బ్లాక్ లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో బండి సంజయ్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. పదవీ బాధ్యతల కార్యక్రమానికి హాజరై బండి సంజయ్ కు ఆశీస్సులు అందించనున్నారు జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి…
రేపు గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రిలిమినరీ కీ ని వెబ్సైట్లో పెట్టనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈ నెల 9వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని టీజీపీఎస్సీ వెబ్సైట్లో 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాథమిక కీతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు. అభ్యర్థులు…