UPSC పరీక్ష జూన్ 16 ఆదివారం జరగనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఘజియాబాద్‌లో ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు నమో భారత్ రైలును నడపాలని నిర్ణయించారు. రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) చుట్టూ ఉన్న కేంద్రాల్లో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ఉదయం 8 గంటలకు బదులుగా ఉదయం 6 గంటల నుంచి నమో భారత్ రైలు సేవలను ప్రారంభించాలని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) నిర్ణయించింది.
సీఎం రేవంత్ ఆదేశాలననుసరించి రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్ ‘ లను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. రాష్ట్రంలో క్యాంటీన్ సర్వీస్ ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్ స్టాండ్ లు, పారిశ్రామిక ప్రాంతాలలో మహిళా…
Yediyurappa: 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో బీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప(81) విచారణకు హాజరుకాకపోవడంతో బెంగళూర్ కోర్ట్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా అమెరికాను ఓడించి సూపర్-8కి చేరింది. అయితే.. అమెరికా ఓటమితో సూపర్-8కి చేరుకోవాలన్న పాకిస్థాన్ ఆశలు సజీవంగానే మిగిలాయి. మరోవైపు.. ఇతర జట్ల ప్రదర్శనపై కూడా ఆధారపడి ఉంది. అయితే.. పాకిస్తాన్ జట్టు తన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడేందుకు ఆటంకం కలిగేలా ఉంది. జూన్ 16న ఐపాకిస్థాన్ ఇప్పుడు జూన్ 16న ఐర్లాండ్‌తో పాకిస్తాన్ తలపడనుంది. ఈ మ్యాచ్ కు వర్ష గండం బీభత్సంగా ఉంది. పాకిస్తాన్-ఐర్లాండ్ మ్యాచ్…
తెలంగాణ లాసెట్/ పీజీ ఎల్సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఫలితాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల కోసం 50,684 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మూడేళ్ల లా కోర్సు కోసం 36,079 మంది, ఐదేళ్ల లా కోర్సు కోసం 10,197 మంది, ఎల్ఎల్ఎం పరీక్ష కోసం 4,408 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 50,684 మంది అభ్యర్థులకు గాను.. 40,268 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో 72.66…
హైదరాబాద్ పోలీస్ కమిషనర్టాస్క్ఫోర్స్ ఓ హోటల్లో భారీ వ్యభిచార ముఠాను ఛేదించి ముగ్గురు నిర్వాహకులను పట్టుకుంది. ఘటనా స్థలం నుంచి ఆరుగురు బాధితులను రక్షించారు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ బృందం హోటల్‌పై దాడి చేసి సూర్యకుమారి అలియాస్ రాణి (38), కె విజయ శేఖర్ రెడ్డి (49), అర్కోకిత్ ముఖర్జీ (30)లను పట్టుకోగా, వారి సహచరులు మరో ఇద్దరు తప్పించుకోగలిగారు. “రాణి తన సహచరుల సహాయంతో త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి మహిళలను…
బ్రిటన్‌లో ఓ నర్సు దారుణ ఘటనకు పాల్పడుతుంది. అప్పుడే పుట్టిన నవజాత శిశువులను చంపేస్తుంది. ఇంతకుముందు కూడా ఆ నర్సుపై పిల్లలను చంపుతున్న ఆరోపణలపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. 2016 ఫిబ్రవరిలో వాయువ్య ఇంగ్లండ్‌లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్లో నెలలు నిండని నవజాత శిశువును చంపడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా మరోసారి విషయం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. లూసీ లెట్బీ అనే నర్సు తాను పనిచేస్తున్న ఆసుపత్రిలో నవజాత శిశువును చంపడానికి ప్రయత్నించింది.…
హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మంత్రిత్వ శాఖ సిబ్బంది నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ పాల్గొన్నారు. రాయ్ , బండి సంజయ్ కూడా కౌగిలించుకున్నారు. ఈ కార్యక్రమానికి హంపి మఠం శ్రీ విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జగద్గురు విద్యారణ్య భారతి స్వామీజీ కూడా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ,…
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాలు విరిగిందని ఆస్పత్రికి వచ్చిన యువకుడికి వైద్యులు మాములు వైద్యం చేయలేదు. విరిగిన కాలుకు ప్లాస్టర్‌కు బదులు అట్టపెట్టను కట్టి చికిత్స చేశారు. ఈ ఘటన మినపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది.
ఈనెల 18 నుంచి శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీ లతో భేటీ కానున్నారు. ఈనెల18న వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేతశాఖల ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఈనెల 21న రెవెన్యూ, గృహనిర్మాణం, ఐఅండ్ పీఆర్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, వైద్య-ఆరోగ్య శాఖలతో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈనెల 22న ఆర్అండ్బీ, సినిమాటోగ్రఫీ, ఐటీ, పరిశ్రమల శాఖ పై…